అంతరిక్షంలో ఓ జీవి 33 మంది పిల్లలకు జన్మనిచ్చింది. సుమారు 12 రోజుల పాటు ఆ జీవి అంతరిక్షంలో ఉండి అక్కడే గర్భం దాల్చి, పిల్లలకు జన్మనివ్వడంపై సైంటిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
డ్రాగన్ కంట్రీ చైనాలో మరో వైరస్ భయ పెడుతోంది. పిల్లల్లో న్యూమోనియా లాంటి జబ్బు ఆందోళన కలిగిస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా 24 గంటల్లో మరో 700 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇప్పటి వరకూ ఈ యుద్ధం కారణంగా 6 వేల మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం డెత్ జోన్‌గా గాజా సిటీ మారిపోయింది.
దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని విశ్వవిద్యాలయ వ్యాయామశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత చెందగా..40 మందికిపైగా గాయపడినట్లు అక్కడి మీడియా నివేదించింది.
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. మిండానావోలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీచేశారు.
సూర్యుని వద్ద పరిశోధనలు చేయడానికి ఇస్రో ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మిషన్ సౌర గాలులకు సంబంధించిన ఫోటోలను పంపింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఓ 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆఫ్రికాలోనే ఇలా అతి పెద్ద వయసులో పిల్లలకు జన్మనిచ్చిన ఏకైక మహిళగా ఆమె రికార్డుకెక్కింది. తల్లి అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకున్నందుకు పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాజాలో మరోసారి మారణహోమం ప్రారంభమైంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో నేడు ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. ఈ మారణహోమంలో 178 మంది దుర్మరణం చెందారు.
దుబాయ్ పర్యటనలో ప్రధాని మోదీ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు కాలుష్య నివారణకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 7 ద్వైపాక్షిక సమావేశాల్లో పలు కీలక విషయాల గురించి చర్చించారు.
ప్రపంచంలోనే అతి శక్తివంత దేశమైన రష్యాలో ఇప్పుడు భారీగా జనాభా తగ్గిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మహిళలకు కీలక సూచన చేశారు. ప్రతి మహిళా 8 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచించారు.
అమెరికాలో వైసీపీ నేత.. ఓ కుర్రాడికి నరకం చూపించాడు. మంచి జాబ్ ఉందని చెప్పి 7 నెలల నుంచి టార్చర్ పెట్టాడు. అతనికి మరో ఇద్దరు సహకరించారు.
ఇరాక్‌లోని తూర్పు దియాలా ప్రావిన్స్‌లో గురువారం సాయంత్రం ఒక వాహనం, రెస్క్యూ టీమ్‌పై బాంబు దాడి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పలువురిపై దుండగులు బాంబులపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా..14 మంది గాయపడ్డారు.
మనదేశంలో జరిగే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓటు(vote) హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి కాదు. కానీ అనేక దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోతే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అవి ఏంటి? ఎలా అమలు చేస్తున్నారనే విషయం ఇప్పుడు చుద్దాం.
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజే రూ.లక్ష కోట్ల ఆదాయం రావడంతో సంపన్నుల జాబితాలో ఆయన మరో రెండు స్థానాలు ఎగబాకారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో టాప్20 జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు.
వంట నూనె, ఇతర ఇంధన మిశ్రమంతో బోయింగ్ ఫ్లైట్ నడిపించి చరిత్ర సృష్టించింది వర్జిన్ అట్లాంటిక్ ఏవియేషన్ సంస్థ. హిత్రో నుంచి న్యూయార్క్‌కు మంగళవారం ఆ విమానం బయల్దేరింది.