పేగు తెంచుకుని పుట్టిన కన్నపిల్లలను తల్లి హత్య చేసిందని ఆరోపణలతో క్యాథ్లీన్ ఫాల్బిగ్ అనే మహిళకు కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. తనని తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఆమెకు 20 ఏళ్లు పట్టింది.
హైవే రోడ్డుపై 17 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
గురుగ్రహంపై రెండు భారీ తుఫాన్‌లు చెలరేగాయి. అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తుఫాన్‌లను నాసా ఫోటోలు తీసింది. వాటర్ కలర్ రంగులో రెండు తుఫాన్‌లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఈ ఆదివారం 87వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం మెక్సికన్ టీవీ ఛానెల్ ఎన్ ప్లస్‌తో పోప్ తన అంత్యక్రియల గురించి మాట్లాడారు. తనని వాటికన్ బయటే ఖననం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.
హమాస్ తీవ్రవాదులను జలసమాధి చేసేందుకు ఇజ్రాయెల్ ఓ హ్యూహాన్ని రచించింది. గాజా టన్నెల్లో సముద్రపు నీళ్లు నింపాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్లాన్ చేశాయి. సొరంగంలో మొత్తం నీటిని నిండడానికి వారం రోజుల సమయం పడుతుందని తెలుస్తుంది. దీంతో ఉగ్రవాదులు బయటకు రావడమో, అక్కడే సమాధి కావడమో జరుగుతుందని అమెరికా వర్గాలు తెలిపాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe biden) వచ్చే ఏడాది భారత్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావడం లేదని తెలిసింది. పలు కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పాక్‌లో ఉగ్రవాదులు దాడులు చేయడం వల్ల 23 మంది ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మరో 16 మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు.
కొండ చరియలు విరిగి పడటం వల్ల 14 మంది చనిపోయారు. భవనాల శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భీకర వర్షాలకు చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
9 మేకలు ఏడాది పాటు జైలు శిక్షను అనుభవించాయి. స్వేచ్ఛగా బయట తిరుగుతూ గడ్డి మేయాల్సిన వాటిని జైలులో ఉంచి అధికారులు గడ్డి వేస్తూ వచ్చారు. ఏడాది తర్వాత అవి ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది.
ప్రపంచంలో పురాతన వస్తువులతో పాటు పురాతన జంతువులు కూడా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి జీవిస్తూ.. పురాతన తాబేలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న తాబేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోరింత దగ్గు లేదా 100 రోజుల దగ్గు గురించి యూకే ప్రభుత్వం అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, దీంతోపాటు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
ఉత్తర ఇరాక్‌లోని సోరాన్‌లో యూనివర్సిటీ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొందరు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఒక బిలియనీర్ తన ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా తనకు సేవలు చేసిన వ్యక్తికి తన ఆస్తిలో వాటాను ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది. ఒకటి కాదు రెండు కాదు ఆ ఆస్తి విలువ 90 వేల కోట్లకుపైగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఓ మహిళ కళ్లలో 60 కీటకాలను వైద్యులు గుర్తించారు. ఆ మహిళ పెంపుడు జంతువులతో ఆడుకోవడం వల్ల వాటి లార్వా నుంచి ఆ కీటకాలు ఆమె కళ్లలోకి చేరినట్లు వైద్యులు నిర్దారించారు. ఆపరేషన్ చేసి ఆమె కంటి నుంచి 60 కీటకాలను బయటకు తీశారు.