పాకిస్తాన్ (Pakistan)లో ఉగ్రదాడి (Terrorist Attack) జరిగింది. ఈ దాడిలో 23 మంది పాక్ సైనికులు మృతిచెందారు. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో మంళవారం ఉగ్రవాదులు పాక్ పోలీసులను టార్గెట్ చేశారు. పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 23 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాక్ లోని వజీరిస్తాన్ గిరిజన జిల్లా సరిహద్దులో ఉన్న దర్బన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడులు చేశారు. మొదట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలున్న వాహనంతో పోలీస్ స్టేషన్ భవనాన్ని ఢీకొన్నారు. మోర్టార్ బాంబులతో దాడులు చేయడంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు భద్రతా సిబ్బందితో సహా 23 మంది దుర్మరణం (23 Soldiers died) చెందారు. దాడుల్లో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను సైతం పోలీసులు హతమార్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దాడులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఎంత మంది ఈ దాడికి కారణమయ్యారనే విషయం తెలియరాలేదు. ఈ ఉగ్రదాడుల్లో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పేలుడు పదార్థాలను గుర్తించేందుకు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నారు.