గాజా నగరంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని పాకిస్థాన్ మాత్రమే అడ్డుకోగలదట. ఇజ్రాయెల్‌ను ఆపడం కేవలం పాకిస్థాన్‌కే సాధ్యమని.. పాక్‌కు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది.
Hamas: దాయాది దేశం పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. తినడానికి తిండి లేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. సొంత దేశంలో ఉండే సమస్యలను నివారించుకోలేని పాక్.. ఇప్పుడు గాజా నగరంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని అడ్డుకోగలదట. ఇజ్రాయెల్‌ను ఆపడం కేవలం పాకిస్థాన్‌కే సాధ్యమని.. పాక్‌కు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్, హమాస్ దళాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఇజ్రాయెల్ దళాలు హమాస్ గాజా ప్రభుత్వ అధిపతి యాహ్యా సిన్వార్ ఇంటిని చుట్టుముట్టాయి. గాజాలోని ఖాన్‌యూనిస్ నగరం నడిబొడ్డుకు తమ దళాలు చేరుకొన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. సొరంగాల్లో ఉన్న హమాస్ బలగాలు బయటకు వచ్చి పోరాడుతున్నాయని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారి వెల్లడించారు.
హమాస్‌ను భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో పాక్ మీడియా సంస్థ కథనం బయటకు వచ్చింది. అయితే హమాస్‌కు చెందిన ఇస్మాయిల్ హనియా పాక్‌లో జరిగిన క్యార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ మద్దతు కోరారు. ఇజ్రాయెల్‌కు పాకిస్థాన్ నుంచి ప్రతిఘటన ఎదురైతేనే తప్ప ఈ ఘర్షణ ఆగదని వ్యాఖ్యానించారు. గాజాలో ఒక శరణార్థి శిబిరంలో జన్మించిన ఇస్మాయిల్.. ప్రస్తుతం ఖతార్ నుంచి హమాస్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. కానీ తర్వాత ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను పెంచింది. ప్రస్తుతం గాజా అంతటా విస్తరించడంతో మళ్లీ ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర గాజాలోని సిటీ పూర్తిగా ధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. దక్షిణ గాజాలో కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశముందని పాలస్తీనీయులు ఆందోళన చెందుతున్నారు.