»Tears In The Eyes Of North Korean President Kim Jong Un
Kim Jong Un: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కంట కన్నీరు.. వీడియో వైరల్!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. అతను విధించే శిక్షల గురించి నెట్టింట్లో కథనాలు వస్తాయి. అలాంటి వ్యక్తి ఒక సభలో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Tears in the eyes of North Korean President Kim Jong Un
Kim Jong Un: నార్త్ కొరియా(North Korean) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) అంటే తెలియని వారు ఉండరు. ఆయన పేరు చెబితే చాలా మంది ఆయన కర్కోటకుడని, కఠినాత్ముడని మాట్లాడుతారు. అలాంటిది ఆయన కంట కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో జననాల రేటు క్షీణిస్తుందని, ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ తల్లులకు విజ్ఙప్తి చేశారు. ఇటీవల ప్యాంగాంగ్‌లో జరిగిన ఓ సభలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరకొరియాలో జననాల రేటు పడిపోవడంపై సభలో పాల్గొన్న వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కీలక నేత మాట్లాడుతుండగా కిమ్ భావోద్వేగానికి లోనయ్యారు. దాంతో చెమ్మగిల్లిన కళ్లను టిష్యూతో తూడుచుకున్నారు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఏ చిన్న తప్పు చేసినా మరణశిక్షలాంటి పెద్ద శిక్షలు విధించడం, కఠినమైన నిర్ణయాలతో ప్రజలను బాధపెట్టడం తప్పా తాను ఏ మాత్రం చలించని కిమ్ కన్నీరు పెట్టడం అందరిని ఆశ్చార్యానికి గురిచేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అలాంటి పాలకుడి కంట కన్నీరు చూసి సభలో ఉన్న మహిళలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు నిశ్శబ్దంగా ఏడుస్తుండడం వీడియోలో చూడోచ్చు. కరోనా సంక్షోభం తరువాత నార్త్ కొరియా మరింత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. పొరుగు దేశాలతో వాణిజ్యవ్యాపారాలు తగ్గిపోయాయి. దేశంలోని జనభా కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితుల్లో లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎక్కవ మంది పిల్లలను కనాలి అని చెప్పడం అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. వీరికే తినడానికి సరైన ఆహారం లేదు, ఇక పిల్లలను ఆరోగ్యంగా పెంచడం ఎలా అని వాపోతున్నారు. దీనిపై నెటిజనులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా నియంత ఆలోచననే అని కొందరు అంటుంటే, పేదరికం నుంచి బయటపడడానికి ప్రత్యమ్నాయ మార్గాలను కల్పించాలని మరికొందరు అంటున్నారు.
NEW: North Korean dictator Kim Jong Un starts crying as he begs North Koreans to have more babies.
North Korean birth rates are about to skyrocket 📈
The incident happened at the National Mothers Meeting hosted by the dictator who started dabbing his eyes in an effort to get… pic.twitter.com/F8xg0dZ05J