»A Huge Explosion Followed A Shooting At A House In Virginia Usa
USA: గన్ తో కాల్పులు.. ఇంట్లో భారీ పేలుడు
ఫ్లేర్ గన్తో ఒక వ్యక్తి ఇంట్లో కాల్పులు జరుపుతుండడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే పోలీసులపై కాల్పులు మొదలు పెట్టాడు. అకస్మాత్తుగా ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఇల్లు కాలి బూడిదయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
A huge explosion followed a shooting at a house in Virginia, USA
USA: అమెరికా (America)లో ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఫ్లేర్ గన్తో ఓ వ్యక్తి కాల్పులు జరుపుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. అది గమనించిన వ్యక్తి పోలీసులపై ఇంట్లో నుంచి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ కాల్పులకు ఏకంగా ఇల్లే పేలిపోయింది. ఈ సంఘటన వర్జీనియా (Virginia)లోని ఆర్లింగ్టన్లో చోటు చేసుకొంది. బ్లూమాంట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక వ్యక్తి ఫ్లేర్ గన్తో కాల్పులు జరుపుతున్నట్లు సమాచారంతో పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకొని ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన సదరు వ్యక్తి వారిపై కాల్పుల జరిపాడు. ఇంట్లో నుంచే దాదాపు పది రౌండ్ల దాకా కాల్పులు జరిపాడు. దాంతో ఒక్కసారిగా ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఇల్లు కాలి బూడిదయ్యింది. ఇంటి బయట ఉన్న కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ ప్రదేశం అంతా పొగతో అలుముకుంది. ఇంట్లో ఎంత మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోరు అనేది ఇంకా తెలియలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చుట్టు పక్కల వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు.