అక్షత మూర్తి తన భర్త రిషి సునక్ ప్రధానమంత్రి పదవీ చేపట్టడంలో ముఖ్య భూమిక పోషించారని ఆమె తల్లి సుధా మూర్తి అన్నారు.
ఇటీవల సూర్య గ్రహణం అయిపోగా, మరో వారం రోజుల్లో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం(first Chandra Grahan 2023) ఇదే కావడం విశేషం.
ఈ మాటలు విన్న లూసీకి నోట మాట రాలేదు. కిడ్నీ కోసం ఎక్కడెక్కడో వెతుకున్న తనకు ఇక్కడ లభించడంపై షాక్ కు గురైంది. కాగా ఇప్పుడు లూసీకి కిడ్నీ మార్పిడి పూర్తయ్యింది. పూర్తి ఆరోగ్యంగా ఉంది.
ఈ పరీక్షలకు ఆ పెంగ్విన్ పూర్తిగా సహకరించింది. స్కానింగ్ చేయించుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పరీక్షల అనంతరం పెంగ్విన్ యథావిధిగా నడుస్తోంది. ప్రస్తుతం దాని పరిస్థితి మెరుగైంది.
పాకిస్థాన్(pakistan)లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి కదులుతున్న ప్యాసింజర్ రైలు(passenger train)లో మంటలు(fire) చెలరేగాయి. దీంతో ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చర్యలు చేపట్టారు.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) యూఏఈ షార్జా(Sharjah) జైలు(jail) నుంచి ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె జైలులో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అవి ఏంటీ? అసలు ఈమె జైలుకు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా తార కాకపోయినా ఆ స్థాయిలో పాప్యులారిటీ అందుకున్న అందాల భామ కిమ్ కర్డాషియన్ (Kim Kardashian). అమెరికాకు చెందిన ఈ సెలబ్రిటీ తన రూపలావణ్యాలు, శరీర ఆకృతి, తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ధరించిన షర్ట్ పై నెట్టింట చర్చ జరుగుతోంది.
వాట్సాప్(WhatsApp) వినియోగదారులకు మంచి అప్ డేట్ వచ్చేసింది. ఎందుకంటే ఇక నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. నిన్న సాయంత్రం వాట్సాప్ సంస్థ ఈ మేరకు ప్రకటించింది.
స్మగ్లర్లు (Smugglers) చిత్ర విచిత్రమైన మార్గాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా డ్రగ్స్ సరఫరా చేసినా..ఎక్కడో ఓ చోటు దొరికిపోతుంటారు. తాజాగా న్యూజిలాండ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ వృద్ద దంపతులు అడ్డంగా దొరికిపోయారు.
అగ్రరాజ్యం అమెరికా 80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడైన్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో 2024లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ సైతం 2024 ఎలక్షన్లలో పోటీ చేస్తానని వెల్లడించారు.
మరోసారి పాకిస్థాన్(Pakistan) బాంబు పేలుళ్ల(Bomb Blast)తో దద్దరిల్లిపోయింది. వరుస పేలుళ్లలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 12మంది పోలీసులు(Police) ఉన్నారు. ఈ పేలుడు దాటికి 50 మందికి పైగా సామాన్యులు గాయపడ్డారు.
చర్చి పాస్టర్ చెప్పాడని 47 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జీసస్ ను కలవడానికి మూఢనమ్మకంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చైనాకు లక్ష కోతులను శ్రీలంక ఎగుమతి చేయనుంది. శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో అరుదైన ‘టోక్ మకాక్’ కోతులు(toque macaque monkeys) ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అవి అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించబడ్డాయి.
న్యూజిలాండ్‌లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. కెర్నాడెక్ దీవుల్లో ప్రకంపనాలు వచ్చాయని అమెరికా జియాలజిస్టులు తెలిపారు.