స్మగ్లర్లు (Smugglers) చిత్ర విచిత్రమైన మార్గాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా డ్రగ్స్ సరఫరా చేసినా..ఎక్కడో ఓ చోటు దొరికిపోతుంటారు. తాజాగా న్యూజిలాండ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ వృద్ద దంపతులు అడ్డంగా దొరికిపోయారు.
స్కాట్లాండ్(Scotland)లో విచిత్రం జరిగింది. ఓ వృద్ధ దంపతులు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. గొర్రెపిల్ల (sheep child) సాయంతో పది లక్షల విలువైన డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తూతో పట్టుబడ్డారు. ఈ జంట 10 లక్ష విలువైన డ్రగ్స్‌తో గొర్రెపిల్లను కారులో తీసుకెళ్లారు. ఏప్రిల్ 22న స్కాంట్లాండ్ లోని ఎం74 హైవేపై వృద్ధ దంపతులు కారులో వెళ్తుండగా పోలీసులు కారును తనిఖీ చేశారు. అనంతరం పరీశీలన చేయగా కారు వెనుక సీటులో గొర్రెపిల్ల కనిపించింది. ఆ వృద్ద దంపతులు గొర్రె పిల్లతో ఆడుకోవడాన్ని పోలీసులు (police) గమనించారు.
అక్కడే చిప్స్ ప్యాకెట్ కూడా కనిపించింది. కానీ పోలీసులతో ఉన్న డాగ్ పదేపదే కారు వెనుకసీటునే అనుమానంగా చూసింది. అయితే మొదట గొర్రెపిల్లపై కుక్క దాడి (dog attack) చేస్తుందని భావించిన పోలీసులు…ఆ తరువాత దంపతులపై అనుమానం వ్యక్తం చేశారు. వెనుక సీటును క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 10 లక్షల విలువైన డ్రగ్స్ ప్యాకెట్(packet of drugs) లభించింది. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..వృద్ధ దంపతులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు లక్షల విలువైన హెరాయిన్ (Herayin), మూడు లక్షల విలువైన కొకైన్ (Cocaine) లభ్యమయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఆన్లైన్లో పలు విషయాలను వెల్లడించారు.