2025 నాటికి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 5G కనెక్షన్లు (5G connections) 3.2 బిలియన్లకు పెరుగుతాయని తెలుస్తోంది. మొబైల్ సబ్‌స్క్రైబర్ మరియు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) 5G కనెక్షన్లు 2025లో 3.2 బిలియన్లకు పెరుగుతున్నట్లు నిదికలో వెళ్లడైంది, ఇది ఐదేళ్ల సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (CAGR) 87.9 శాతంతో పెరుగుతుందని ఒక అంచనా. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.
IDC ప్రకారం, ఆసియా-పసిఫిక్‌లోని టెలికాం క్యారియర్ లో 12.4 శాతం మంది 5G విస్తరణకు ప్రధాన కారణాలలో IIoTని పరిగణించారు. “డిజిటలైజేషన్ మరియు కనెక్టివిటీ ద్వారా పచ్చదనంతోపాటు, తక్కువ కార్బన్ గల భవిష్యత్తును ఏర్పరుచుకోవడం సాధ్యమవుతుంది” అని IDCలోని టెలికమ్యూనికేషన్స్ మరియు IoT, ఆసియా పసిఫిక్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ పీయూష్ సింగ్ అన్నారు.
పరిశ్రమ 4.0లోని కాన్సెప్ట్‌లలో ఒకటి సామర్థ్యం శక్తి పొదుపుకు సమానం. ఇంధనాన్ని ఆదా చేసేందుకు సంస్థలు చేసే ఏదైనా పని చివరికి దాని సామర్థ్యాన్ని పెంచుతుందని సింగ్ అన్నారు. ఆసియా-పసిఫిక్ అంతటా తయారీ చేసే సౌకర్యాలను, ప్రత్యేక నెట్‌వర్క్‌లతో పాటు వివిధ పరికరాలను నియంత్రించేందుకు వీలుంది. అస్థిర వైర్లెస్ కమ్యూనికేషన్ మరియు జాప్యం అనేది ఏదైనా సంస్థలో డిజిటల్ పరివర్తనను స్వీకరించడానికి అడ్డంకులను 5G సహాయంతో పరిష్కరించవచ్చు. IIoT పరికరాలకు ఆధారపడదగిన కమ్యూనికేషన్ అవసరం, ఇది ప్రైవేట్ 5G నెట్వర్క్ ద్వారా కూడా సులభంగా అందించబడుతుందని నివేదిక పేర్కొంది.