భారత్(India)లోకి త్వరలో 6G టెక్నాలజీ (6G Technology) రానుంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ (Pm Modi) ఈ విషయం గురించి తెలిపారు. దేశంలో మొబైల్ డేటా ప్లాన్లు, ఇంటర్నెట్ సేవల సక్సెస్ గురించి ఆయన ప్రస్తావించారు. 5జీ కంటే 6జీ 100 రెట్లు వేగంగా ఉంటుందని, అనేక పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులను తెస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇండియాలోనే అతి చౌకైన మొబైల్ డేటా ప్లాన్లు, ఇంటర్నెట్ సేవలు (Internet services) అందిస్తున్నట్లు తెలిపారు.
ఇండియా (India)లో చాలా మంది 5జీ (5G) వినియోగిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చూపంతా 6జీ (6G)ని వినియోగంలోకి తీసుకురావడంపైనే ఉంది. నెమ్మదిగా 6జీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్కార్ మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది.
5జీ (5G) కంటే 6జీ (6G) చాలా వేగంగా ఉంటుంది. 5జీలో అయితే సెకనుకు 10 గిగాబైట్ల వరకూ వేగం ఉంటుంది. అదే 6జీలో అయితే సెకనుకు 1 టెరాబిట్ వేగం ఉంటుంది. 6జీతో కేవలం ఓ నిమిషంలోనే 100 సినిమాల వరకూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6జీ అనేది భూమిపై అలాగే ఆకాశంలో కూడా పనిచేస్తుంది. విమానంలో ఉన్పప్పుడు కూడా నేలపై ఉన్నవారితో కమ్యూనికేట్ చేయొచ్చు. 6జీతో యంత్రాలను, గాడ్జెట్స్‌ను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయొచ్చు. వేగంగా ఇంటర్నెట్ (Internet services)ను వినియోగించుకోవచ్చు. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.