TPT: పేర్నాడు-వేనాడు రోడ్డు కోసం అనుమతి ఇవ్వాలని సూళ్లూరుపేట MLA విజయశ్రీ Dy.CM పవన్ను కోరారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన ఆయనను MLA కలిశారు. పులికాట్ పరివాహక ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణం ఉండటంతో అటవీశాఖ నుంచి అనుమతులు ఆలస్యం అవుతున్నాయన్నారు. దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె విన్నవించారు.