»Melanoma Skin Cancer Vaccine Worlds First Jab To Stop Skin Cancer Being Tested In Uk
MELANOMA : ఆ క్యాన్సర్‌కు టీకా.. క్లినికల్ ట్రయల్స్ సక్సస్!
క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టేందుకు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మెలనోమా క్యాన్సర్ కోసం తయారు చేసిన టీకా క్లినికల్ ట్రయల్స్‌లో విజయం సాధించింది.
MELANOMA VACCINE : చర్మ క్యాన్సర్(SKIN CANCER) అయిన మెలనోమా క్యాన్సర్‌కు రానున్న కాలంలో టీకాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ కోసం గత కొంత కాలంలో మోడెర్నా, ఎండీఎస్ అనే రెండు ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. వీరు తయారు చేసిన వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ని విజయవంతంగా పాస్ అయింది. మెరుగైన ఫలితాలను సాధించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిట్‌కు చెందిన వైద్యుల పర్యవేక్షణలో మూడో దఫా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని తెలిపాయి.
మెలనోమా క్యాన్సర్( MELANOMA CANCER) వచ్చిన వారికి ఈ వ్యాక్సిన్‌ను(VACCINE) కీట్రుడా అనే మరో మందుతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అలా చేయడం వల్ల ఆ క్యాన్సర్ ఆ వ్యక్తికి మళ్లీ తిరిగి రాకుండా ఉంటుందని చెబుతున్నారు. వీరు అభివృద్ధి చేసిన mRNA -4157 అనే వ్యాక్సిన్ మెలనోమా క్యాన్సర్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వీరు తెలిపారు. మూడు వారాలకు ఒక డోసు చొప్పున దీన్ని దాదాపుగా తొమ్మిది డోసుల వరకు ఇవ్వవలసి ఉంటుందని పేర్కొన్నారు.
మెలనోమా(MELANOMA) రోగికి ఆపరేషన్ ద్వారా తొలగించిన కణతుల నుంచి నమూనాలన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో డీఎన్ఏ సీక్వెన్సింగ్ చేస్తారు. దాని ఆధారంగా ఈ వ్యాక్సిన్‌ని రోగికి తగినట్లుగా తయారు చేస్తారు. అందువల్ల వ్యాక్సిన్ రోగిలోని క్యాన్సర్ కణాలను గుర్తించగలుగుతుంది. సమర్థవంతంగా వాటిపై పని చేస్తుంది. అందువల్ల ఈ క్యాన్సర్ మళ్లీ తిరగబడకుండా ఉంటే అవకాశాలుంటాయి.