Girl Friendను ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ నిశ్చితార్థం.. ఉంగరం ఎంతో తెలుసా?
మొదటి భార్యతో 25 ఏళ్ల వివాహా బంధాన్ని తెగదెంపులు చేసుకున్న అనంతరం వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఆమెతో విడాకులు తీసుకుని 38 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించాడు. అనంతరం అధికారికంగా బంధాన్ని తెంచుకున్నారు.
అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఐదేళ్ల నుంచి ప్రేయసితో డేటింగ్ (Dating)లో ఉన్న బెజోస్ ఎట్టకేలకు ఆమెను వివాహం చేసుకోనున్నాడు. అందులో భాగంగా ఆమెను కొద్ది మంది సమక్షంలో ఉంగరం (Ring) తొడిగి నిశ్చితార్థ వేడుకను (Engagement) పూర్తి చేసుకున్నాడు. ఆమె చేతికి అత్యంత ఖరీదైన ఉంగారాన్ని బెజోస్ తొడిగాడు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
లారెన్ సాంచెజ్ (Lauren Sanchez) అనే మాజీ జర్నలిస్ట్ (Journalist)తో బెజోస్ ప్రేమాయణం సాగిస్తున్నాడు. 2018 నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. 2019 వరకు ఈ బంధాన్ని బహిర్గతపరచలేదు. మొదటి భార్య మెకంజీ స్కాట్ తో 25 ఏళ్ల వివాహా బంధాన్ని తెగదెంపులు చేసుకున్న అనంతరం వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. స్కాట్ తో నలుగురు పిల్లలకు బెజోస్ జన్మనిచ్చాడు. ఆమెతో విడాకులు తీసుకుని 38 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించాడు. అనంతరం అధికారికంగా బంధాన్ని తెంచుకున్నారు.
అంతకుముందే తనకు పరిచయమైన శాంచెజ్ తో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరూ రహాస్యంగా నిశ్చితార్థం వేడుక చేసుకున్నారు. 20 క్యారెట్ల (Carat) విలువైన వజ్రపు ఉంగరాన్ని శాంచెజ్ కు బెజోస్ తొడిగాడు. కాగా బెజోస్ కు 59 ఏళ్లు ఉండగా.. శాంచెజ్ కు 53 ఏళ్ల వయసు ఉంది. ఆమెకు కూడా ఇది రెండో వివాహం (Marriage) కావడం గమనార్హం. ఆమెకు ముగ్గురు కలిగి ఉన్నారు. కాబోయే జంట ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)లో పాల్గొంటున్నారు. ఆ వేడుకలో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.