»Bbc Gets Hc Notice On Defamation Suit For Its Documentary On Narendra Modi
BBCపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా
ప్రధాని మోదీని, భారత న్యాయ వ్యవస్థను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు డాక్యుమెంటరీలో చేశారని ఆరోపించింది. ప్రధాని మోదీ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. దీనికి నష్ట పరిహారంగా బీబీసీ రూ.10 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది.
గుజరాత్ (Gujarat)లోని గోద్రా అల్లర్లు వెనుక నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అస్త్రం ఉందని చెప్పేలా ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ (British Broadcasting Corporation) ‘ఇండియా- ద మోదీ క్వశ్చన్’ (India: The Modi Question) డాక్యుమెంటరీని చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శితం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రధాని మోదీని నిందితుడిగా చేస్తూ ఉన్న ఈ డాక్యుమెంటరీపై బీజేపీ, హిందూ సంఘాలు మండిపడ్డాయి. అప్పటి నుంచి బీబీసీపై (BBC) వేధింపులు జరుగుతున్నాయి. కార్యాలయాలపై దాడులు చేయగా.. ఇప్పుడు ఏకంగా పరువు నష్టం దావా వేశారు. అది కూడా రూ.10 వేల కోట్లకు వేయడం గమనార్హం.
ఇండియా- ద మోదీ క్వశ్చన్ డాక్యుమెంటరీ (Documentary) భారత్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ గుజరాత్ కు చెందిన జస్టిస్ ఫర్ ట్రయల్ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో (Delhi HighCourt) పిటీషన్ దాఖలు చేసింది. ప్రధాని మోదీని, భారత న్యాయ వ్యవస్థను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు డాక్యుమెంటరీలో చేశారని ఆరోపించింది. ప్రధాని మోదీ పరువుకు నష్టం (Defamation Case) కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. దీనికి నష్ట పరిహారంగా బీబీసీ రూ.10 వేల కోట్లు చెల్లించాలని జస్టిస్ ఫర్ ట్రయల్ డిమాండ్ చేసింది.
ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన ఢిల్లీ న్యాయస్థానం యూకేలోని బీబీసీ ప్రధాన కార్యాలయం, భారత్ లోని బీబీసీకి నోటీసులు జారీ చేసింది. కాగా, ఆ డాక్యుమెంటరీ ప్రధాని మోదీ నిజస్వరూపాన్ని (Fact) బీబీసీ ఆవిష్కరించింది. ఇది సహించలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. ఎక్కడా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శితం (Ban) కావొద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం బీబీసీపై కక్షసాధింపు చర్యలు తీవ్రంగా జరుగుతున్నాయి. విచారణ సంస్థలు బీబీసీ కార్యాలయాల్లో దాడులు చేసి కేసులు కూడా నమోదు చేశాయి.