»Indian Students Face Exit From Canada Over Fake Papers
Indian students face exit from Canada: కెనడా భారత విద్యార్థులకు డిపోర్టేషన్ భయం
ఫేక్ కాలేజీ అడ్మిషన్ లెటర్ లతో తమ దేశానికి వచ్చినందున, కెనడాను విడిచి వెళ్లాలని (deportation letters from the Canadian Border Security Agency) 150 మందికి పైగా విద్యార్థులకు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (Canadian Border Security Agency-CBSA) ఇటీవల ఆదేశించింది.
ఫేక్ కాలేజీ అడ్మిషన్ లెటర్ లతో (fake papers) తమ దేశానికి వచ్చినందున, కెనడాను విడిచి వెళ్లాలని (deportation letters from the Canadian Border Security Agency) 150 మందికి పైగా విద్యార్థులకు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (Canadian Border Security Agency-CBSA) ఇటీవల ఆదేశించింది. అయితే ఫేక్ కాలేజ్ అడ్మిషన్ గురించి తమకు తెలియదని, తాము భారత్ లోని ఓ ఇమ్మిగ్రేషన్ కన్సల్టేషన్ ఏజెన్సీ ద్వారా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018-19లో పంజాబ్ కు చెందిన వందల మంది విద్యార్థులు… జలందర్ కు చెందిన బ్రిజేష్ మిశ్రా అనే ఏజెంట్ ద్వారా కెనడాకు వెళ్లి, చదువులు పూర్తి చేసుకొని, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ హఠాత్తుగా వారికి డిపోర్షన్ లెటర్స్ వచ్చాయి. వీళ్లందరు ఓ ఏజెంట్ ద్వారా వీసాలు పొంది, కెనడా వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
బ్రిజేష్ మిశ్రా ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. వందల మంది విద్యార్థులకు ఫేక్ డాక్యుమెంట్లతో వీసా ఇప్పించి, కెనడా పంపించాడు. ఆ తర్వాత తన కన్సల్టెన్సీ ఆఫీస్ మూసివేశాడు. విద్యార్థులు అక్కడి హంబర్ కాలేజీల్లో చేరేందుకు ఆఫర్ లెటర్ ఇచ్చి పంపించాడు బ్రిజేష్. అడ్మిషన్ ఫీజు సహా ఒక్కో విద్యార్థి నుండి రూ.16 లక్షల వరకు వసూలు చేశాడు. అయితే అక్కడకు వెళ్లాక ఏ కాలేజీలో అయినా చేరవచ్చునని నమ్మబలికాడు. విద్యార్థుల్లో కొంతమంది పైన పేర్కొన్న కాలేజీలోనే తర్వాత సెమిస్టర్ లో చేరారు. మరికొంతమంది ప్రయివేటు కాలేజీ, ఇంకొంతమంది గవర్నమెంట్ కాలేజీల్లో చేరారు. వీరు ఉన్నత విద్యను పూర్తి చేసుకొని, ఉద్యోగం చేస్తున్నారు. కెనడాలో పర్మినెంట్ రెసిడెన్స్ కోసం ఇటీవల ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఫేక్ కాలేజీ అడ్మిషన్ లెటర్ అంశం వెలుగు చూసింది.
ఫేక్ కాలేజీ అడ్మిషన్ లెటర్ లో ఎక్కడా కన్సల్టెన్సీ పేరు, ఏజెన్సీ పేరు లేదు. అంటే బ్రిజేషన్ ముందుగానే తమ కన్సల్టెన్సీ పేరు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఏజెన్సీ ద్వారా వెళ్తే కోడ్ ఎంటర్ చేయాలి. కానీ అలా జరగలేదు. అంటే విద్యార్థులు సొంతగా వెళ్లినట్లు అవుతుంది. ఏ రిస్క్ అయినా అప్పుడు వారే భరించాలి. ఫేక్ సర్టిఫికేట్, కాలేజీ షిఫ్ట్ అయిన విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి చెప్పకపోవడం వంటి అంశాల నేపత్యంలో మిమ్మల్ని ఎందుకు కెనడా నుండి పంపించకూడదంటూ కెనడియన్ ఏజెన్సీ డిపోర్టేషన్ లెటర్లను పంపించింది. కెనడా వెళ్లేవారు ఎవరైనా ఏజెన్సీ ద్వారా వెళ్తే అప్లికేషన్ లో కోడ్ ఉందా లేదా చూసుకోవాలి. ఏ కాలేజీలో అనేది యాజమాన్యాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. కాలేజీ వెబ్ సైట్ లో కూడా వివరాలను చూసుకోవచ్చు.