ఇజ్రాయొల్ (Israel) హమాస్ ఉగ్రవాద బృందం దాడి చేసిన నేపథ్యంలో అక్టోబర్ 7న షెడ్యూల్ చేసిన ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు(Passengers), భద్రతా సిబ్బంది, ప్రయోజనాల దృష్ట్యా విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్యాసింజర్ల, భద్రతా సిబ్బంది, ప్రయోజనాల దృష్ట్యా విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో పేర్కొన్నది. భారత్ (India) నుంచి అక్కడికి రాకపోకలు సాగించే విమానాలను అక్టోబరు 14 వరకు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ‘ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా.. టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేస్తున్నాం’ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ తేదీల్లో టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని పేర్కొంది. హమాస్ (Hamas) మిలిటెంట్లు, ఇజ్రాయెల్ (Israel) సైన్యానికి మధ్య భీకర యుద్దం సాగుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ ఇజ్రాయెల్‌తోపాటు గాజా (Gaza)లో వందలాదిమంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. పదులకొద్ది మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు రేర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తాజాగా వెల్లడించారు. అయితే, ఈ సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వంద మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికుల(Soldiers)ను హమాస్ ఉగ్రవాదులు అపహరించినట్లు టెల్ అవీవ్ ఇప్పటికే తెలిపింది. మొత్తానికి ఇరువైపులా మరణాల సంఖ్య 600 దాటినట్లు వార్తలు వస్తున్నాయి.. ఇందుకు ప్రతికారంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై ఏకంగా యుద్ధాన్నే ప్రకటించాడు. హమాస్ తమ దేశంపై దాడి చేసినందుకు గాను తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.