»October 8 Is The 91st Indian Air Force Day 2023 Lets Remember Their Services
Indian Air Force Day 2023: నేడు 91వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే..వీరి సేవలను స్మరించుకుందాం
నేడు (అక్టోబర్ 8న) భారత వైమానిక దళ దినోత్సవం. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా ఉనికిలోకి వచ్చిన ఈ దళం దేశంలో జరిగేే విపత్తులు, యుద్ధాలు, రక్షణ సేవల్లో కీలకమైన పాత్రను పోషిస్తూ సేవలందిస్తోంది. ఈ సందర్భంగా వీరి సేవలను ఈరోజు గుర్తు చేసుకుందాం.
Today is the 91st Indian Air Force Day 2023 let's remember their services
నేడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) IAF తన 91వ వైమానిక దళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర సంగమం ప్రాంతంలో భారతీయ వైమానిక దళం తన విమానాలను లవ్ కుష్, సుగ్రీవ్ సహా పలు ప్రాంతాల్లో వైమానిక ప్రదర్శన చేసింది. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని వైమానిక ప్రదర్శనలో మొత్తం 120 విమానాలు పాల్గొన్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేను 1932లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) స్థాపన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక చారిత్రాత్మక కార్యక్రమం. భారతదేశ గగనతలాన్ని రక్షించే IAF సిబ్బంది వారి అంకితభావం, ధైర్యం, వృత్తి నైపుణ్యాన్ని ఈ రోజున సత్కరిస్తారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో IAF సిబ్బంది ఎంతో అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ప్రత్యేకంగా వైమానిక ప్రదర్శనలు, కవాతు వేడుకలు నిర్వహించబడతాయి. ఈ క్రమంలో దేశంలోని అనేక వైమానిక స్థావరాలలో భారత వైమానిక దళ దినోత్సవం 91వ వార్షికోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు.
IAF రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి పరిణామం చెందింది. ఇది అక్టోబర్ 8, 1932న స్థాపించబడింది. 1950లో IAFగా మారింది. నేటికీ క్రియాశీలంగా ఉంది. IAF పాకిస్థాన్‌తో 1947-1948, 1965, 1971 (బంగ్లాదేశ్ యుద్ధం), 1999 (కార్గిల్ యుద్ధం)లో సమయాల్లో భారతదేశానికి అండగా నిలిచింది. 1961లో భారత యూనియన్‌లో గోవా చేరికకు మద్దతు ఇచ్చింది. 1962లో చైనీస్ ఆర్మీకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో భారత సాయుధ దళాలకు IAF కీలకమైన వైమానిక మద్దతును అందించాయి. 1984లో సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకోవడానికి IAF సహాయం సాయం తనవంతు పాత్రను పోషించింది. 1988లో మాల్దీవులలో ప్రభుత్వాన్ని పడగొట్టకుండా పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం (PLOTE)ని IAF నిరోధించింది. సంక్షోభ సమయాల్లో IAF విదేశాల నుంచి భారతీయ పౌరులను తిరిగి తీసుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం అందిస్తుంది. ఇలా అనేక సందర్భాలలో IAF దేశానికి కీలకమైన సేవలను అందిస్తూ చిరస్థాయిగా నిలుస్తోంది.