గత ఐదు నెలల నుంచి మణిపూర్‌లో ఘర్షణలు (Manipur Violence) చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. మైతీ కుకీల తెగల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరింది. దీంతో మణిపూర్ మండిపోతోంది. శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ (BJP) సర్కార్ ఆ ప్రాంతానికి సాయుధ బలగాలను భారీ ఎత్తున పంపింది. అయితే ఆందోళనకారులను కట్టడి చేసే క్రమంలో చాలామంది సామాన్యులు సాయుధ బలగాల (Army Force) కర్కశానికి బలవుతున్నారు. వారు చేసిన పనికి తాజాగా ఓ జాతీయ క్రీడాకారుడు (National Sportsman) ప్రాణాలతో పోరాడుతున్నాడు.
మణిపూర్‌లో ఇటీవలె ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు (Students Union) నిరసన ప్రదర్శన చేపట్టాయి. అయితే వారిపై సాయుధ బలగాలు విరుచుకుపడటంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది వాటిల్లింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు ముందస్తు హచ్చరికలు లేకుండానే జవాన్లు పెల్లెట్ గన్నుతో దాడి చేశారు. ఆ దాడిలో జాతీయ క్రీడాకారుడు ఉత్తమ్ సాయిబామ్ (Uttam Saibam) తీవ్రంగా గాయపడ్డాడు.
జవాన్లు చేసిన పనికి ఆ క్రీడాకారుడి తలలో 61 మేకులు (61 Nails) దిగాయి. ప్రస్తుతం ఉత్తమ్ సాయిబామ్ (Uttam Saibam) ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎక్స్‌రే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో బీజేపీని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మైతీ వర్గంవారు కూడా బీజేపీ (BJP)కి దూరమవుతున్నారు.
ఈ ఘటనపై సీఎం బీరేన్‌సింగ్ (CM Birensingh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయుధ దళాలు (Army Force) రాష్ట్ర పరిధిలోకి రావని, వారిని నియంత్రించే అధికారం తనకు లేదన్నారు. సీఎం చెప్పిన మాటలకు అందరూ విమర్శిస్తున్నారు. సీఎం చేతులు దులుపుకున్నారని, అలా చేయడం మంచి పరిణామం కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.