ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్లకి చెందిన మసాలాల్లో ఎక్కువ మోతాదులో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నాయని ఇటీవల నేపాల్ ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్రధాన మసాలా బ్రాండ్ల శాంపిళ్లలో ఇథిలిన్ ఆక్సైడ్ లేదని ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.
FSSAI: ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్లకి చెందిన మసాలాల్లో ఎక్కువ మోతాదులో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నాయని ఇటీవల నేపాల్ ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్రధాన మసాలా బ్రాండ్ల శాంపిళ్లలో ఇథిలిన్ ఆక్సైడ్ లేదని ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ రెండు బ్రాండ్లకు చెందిన శ్యాంపిళ్లను 28 ల్యాబరేటర్లీలో పరీక్షలు చేశారు. మరో ల్యాబ్‌లకు చెందిన రిపోర్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎండీహెచ్, ఎవరెస్టు బ్రాండ్ల మసాలాలు నాణ్యత లేవని, ఇందులో అధిక మోతాదులో ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని హాంగ్‌కాంగ్, సింగపూర్ ఆందోళణ వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రిపోర్ట్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ రిలీజ్ చేసింది.
హాంగ్‌కాంగ్ బ్యాన్ చేసిన ఉత్పత్తుల్లో ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎండీహెచ్ సాంబార్ మసాలా మిక్సిడ్ మసాలా పౌడర్, ఎండీహెచ్ కర్రీ పౌడర్ ఉన్నాయి. ఈ బ్రాండ్లపై వచ్చిన ఆరోపణల నిమిత్తం ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ఉన్న ల్యాబ్‌ల్లో ఇథిలిన్ ఆక్సైడ్ పరీక్షలు చేశారు. ఈ రెండు బ్రాండ్లే కాకుండా ఇతర బ్రాండ్లకు చెందిన మరో 300 శ్యాంపిళ్లను కూడా పరీక్షించినట్లు శాస్త్రీయ నిపుణులు తెలిపారు. సైంటిఫిక్ ప్యానల్ బోర్డులో స్పేస్ బోర్డు, సీఎస్ఎంసీఆర్ఐ(గుజరాత్), ఇండియన్ స్పైస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్(కేరళ), ఎన్ఐఎఫ్టీఈఎం(హర్యానా), బీఏఆర్సీ(ముంబై), సీఎంపీఏపీ(లక్నో), డీఆర్డీవో(అస్సాం), ఐసీఏఆర్, నేషనల్ రీసర్చ్ సెంటర్ ఆన్ గ్రేప్స్(పుణె)కు చెందిన నిపుణులు ఉన్నారు.