పెట్స్‌కు ఫుడ్ పెట్టమంటే ఓకే.. పిల్లి, కుక్క వరకు అయితే ఓకే. ఇప్పుడు కొందరు ఇంట్లో కొండ చిలువలను పెంచుతున్నారు. మెట్రో సిటీల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. మరి పులి, సింహాం, మొసలికి ఫుడ్ పెట్టడం అంటే.. వామ్మో అనేస్తారు. నిజమే, కానీ ప్లోరిడాకు చెందిన ఈయన మాత్రం పిల్లలతో ఆడినట్టు ఓ మొసలికి ఫుడ్ వేశారు. వీడియో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను బార్న్ ఏ కాంగ్ అనే యూజర్ ‘ఓన్లీ ఇన్ ఫ్లోరిడా’ పేరుతో పోస్ట్ చేశారు.
ఓ సరస్సులో బోటు మీద అతను ఉన్నాడు. అక్కడికి ఓ మొసలి రాగా దానిని పైకి తీసుకున్నాడు. కాళ్ల మధ్య ఉంచి మాంసం ముక్కతో ఆడుకున్నాడు. ఫుడ్ ఇవ్వకుండా దోబుచులాడాడు. నోరు తెరవడంతో చివరికి వేశాడు. అది తినేప్పుడు తలపై నిమురుతూ ప్రేమను చూపించాడు. తర్వాత మొసలి తిరిగి సరస్సులోకి వెళ్లిపోయింది. ఈ వీడియో చూసి చాలా మంది భయపడ్డారు. వామ్మో.. అంటూ కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. 3.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 54.3 వేల లైకులు వచ్చాయి. చాలా మంది కామెంట్ చేశారు. అతను ‘నా కన్నా ధైర్యవంతుడు’ అని ఒకరు రాశారు. ‘నా జీవితంలో ఇలాంటి మొసలిని ఎప్పుడు చూడలేదు’ అని మరొకరు కామెంట్ చేశారు. ఆ ఫ్లోరిడా వ్యక్తిని అధ్యయనం చేయాల్సి ఉందని మరొకరు అన్నారు. చాలా మంది ఆశ్చర్య పోయారు. మరికొందరు ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డారు.