Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. ఆఫ్ఘన్ న్యూస్ ఛానెల్ టోలో న్యూస్ ప్రకారం.. హెరాత్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత వారం కూడా హెరాత్ ప్రావిన్స్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. హెరాత్ నగరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది.
భూకంప కేంద్రం 6.3 కిలోమీటర్ల లోతులో ఉంది. USGS తన నివేదికలో తాజా భూకంపం కేంద్రం ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మూడవ అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
A magnitude 6.3 earthquake occurred 32.8 km south, southeast of Herat center at 08:06 today (Sunday) Afghanistan Time, USGS said.
This was followed by another earthquake in the same area, according to a TOLOnews reporter.#TOLOnewspic.twitter.com/NW93VnVtoI
ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ మళ్లీ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి?
ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ తరచుగా భూకంపాల బారిన పడుతోంది. ఈ ప్రాంతం యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ (ఖండన) దగ్గర ఉంది. గతంలో సంభవించిన భూకంపాలలో మరణించిన వారిలో 90 శాతానికి పైగా మహిళలు, పిల్లలేనని యునిసెఫ్ తెలిపింది.