బ్రిటన్ రాజు చార్లెస్ 3 (King Charles 3) పట్టాభిషేకం వేడుకగా జరిగింది. రాచరికపు లాంఛనాలతో బ్రిటన్ సర్కార్ అధికారికంగా ఈ వేడుకను నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం చేయడం ఇదే మొదటిసారి. దీంతో యావత్ ప్రపంచం చార్లెస్3 పట్టాభిషేక మహోత్సవం గురించి చర్చించుకుంది. ఈ వేడుకలో బ్రిటన్ రాజుగా చార్లెస్3 కిరీటాన్ని దరించారు. ఆయన అర్ధాంగి కెమిల్లా పార్కర్ రాణిగా కిరీటాన్ని ధరించింది.
2 వేల మంది అతిథులు చార్లెస్3 పట్టాభిషేకానికి హాజరయ్యారు. అశ్వ దళాలు, సాయుధ దళాలు నడుమ రాజ దంపతులు వెస్ట్ మినిస్టర్ అబేకు చేరుకున్నారు. అక్కడే చార్లెస్3ని అందరికీ పరిచయం చేసి కిరీట ధారణ చేశారు. 1300వ సంవత్సరంలో కింగ్ ఎడ్వర్ట్ తయారు చేయించిన సింహాసనంపై చార్లెస్3(King Charles 3) కూర్చున్నారు. ఆ తర్వాత చార్లెస్ కు బంగారు తాపడం చేసిన రాచరికపు గౌన్ ను తొడిగారు. ఆయనకు రాజముద్ర, రాజదండం అందజేశారు.
రాజు చార్లెస్3 (King Charles 3) ధరించిన కిరీటం 1661లో తయారు చేశారు. ఆ కిరీటం బరువు 2.23 కిలోలు. పట్టాభిషేకం సమయంలోనే గంట పాటు దీన్ని ధరించాల్సి ఉంటుంది. కార్యక్రమానికి వచ్చిన అతిథులంతా గాడ్ సేవ్ కింగ్ అంటూ నినదించారు. ఖడ్గంతో చార్లెస్3 సింహాసనాన్ని అధిరోహించగా అందరూ హర్షం వ్యక్తం చేశారు.