»Another Miracle In The History Of Medicine Pigs Heart For Man
Pig Heart: వైద్య చరిత్రలోనే మరో అద్భుతం.. మనిషికి పంది గుండె!
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 58 ఏళ్ల వ్యక్తికి అమెరికా వైద్యులు పంది గుండెను అమర్చారు. ఈ ఘటనపై వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఇదొక అద్భుత ఘట్టమని అభివర్ణిస్తున్నారు.
వైద్య చరిత్రలోనే మరో అద్భుత ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్ వైద్యులు గుండె మార్పిడి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 58 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చి విజయవంతమయ్యారు. ఆపరేషన్ చేసిన తర్వాత రెండు రోజుల్లోనే ఆ వ్యక్తి సాధారణంగా మాట్లాడగలగడం అద్భుతమని వైద్యులు చెబుతున్నారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్ వైద్య బృందం ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యింది. గతంలో కూడా ఇదే వైద్య బృందం ఓ వ్యక్తికి గుండెను అమర్చడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు పంది గుండెను మనిషికి అమర్చడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. గుండె అమర్చిన ఆ వ్యక్తిపై వైద్యులు పలు పరిశోధనలు చేపడుతున్నారు. కొన్నాళ్లపాటు ఆ వ్యక్తిని అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్లు తెలిపారు.