అమెరికన్ శృంగార తార స్టోర్మీ డేనియల్ (America film star Stormy Daniels) అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ (Donald Trump Arrest), విడుదలైన విషయం తెలిసిందే. అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో ఆయన పైన నమోదైన అభియోగాల మీద న్యూయార్క్ కోర్టు విచారణ జరుపుతోంది. మరోవైపు ట్రంప్ పైన వేసిన పరువు నష్టం కేసులో మాత్రం సదరు శృంగార తారకు మాత్రం షాక్ తగిలింది (Stormy Daniels Loses Defamation Suit). కాలిఫోర్నియాలోని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్.. డేనియల్స్ వాదనను తోసిపుచ్చింది. దీంతో కోర్టు ఫీజులో భాగంగా ట్రంప్ తరఫు లాయర్లకు (legal fees to the attorneys of former US President Donald Trump) లక్షా 20వేల డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ.1 కోటి. మన్ హటన్ కోర్టులో (Manhattan court) ట్రంప్ హాజరైన రోజున మరో కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ట్రంప్ అరెస్టుకు, ఈ సివిల్ కేసుకు సంబంధం లేనప్పటికీ రెండు కూడా స్మార్టీ డేనియల్స్ కు సంబంధించినవి. అయితే గతంలో తన పైన ఆమె చేసిన ఆరోపణల మీద స్పందిస్తూ కేవలం డబ్బు కోసమే ఇలాంటి బెదిరింపు ఆరోపణలు చేస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద డేనియల్స్ 2018లో కోర్టును ఆశ్రయించారు. ఈ పరువు నష్టం కేసులో స్మార్టీ ఓడిపోవడంతో లీగల్ ఫీజు కింద ఆమె 2.93 లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక కోర్టు ఆదేశించింది. అనంతరం పై కోర్టులో అప్పీలు చేసుకోగా, అక్కడ కూడా మరో 2.45 లక్షలు ఫైన్ పడింది. తాజా అప్పీలులోను స్మార్టీ డేనియల్స్ కు చుక్కెదురైంది. దీంతో మొత్తంగా ఆమె దాదాపు 6 లక్షల డాలర్లకు పైగా ట్రంప్ తరఫున అటార్నీలకు చెల్లించాల్సి వస్తోంది.
మరోవైపు, డేనియల్స్ తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న ట్రంప్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని, న్యూయార్క్ మన్ హటన్ కోర్టులో ప్రవేశ పెట్టారు. మొత్తం 34 అభియోగాలను ఆయన పైన మోపారు. వాటన్నింటిలో తాను దోషిని కాదని జడ్జికి తెలిపారు. విచారణ అనంతరం ఆయనకు బెయిల్ మంజూరయింది.