Side Effects : టీలో రస్కుల్లాంటివి ముంచుకుంటున్నారా? మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్లే!
చాలా మంది తరచుగా టీ తాగుతూ ఉంటారు. ఇంకొందరేమో టీలో రస్కులు, బ్రెడ్, బిస్కెట్లలాంటివి ముంచుకుని తింటూ ఉంటారు. ఈ అలవాటు ఏమంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే...
Side Effects of Rusk with Tea : దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా టీలో రస్కులు, బిస్కెట్లు లాంటి వాటిని ఎప్పుడో ఒకప్పుడైనా తినే ఉంటారు. అయితే కొంత మందికి మాత్రం ఈ అలవాటు మరీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంత మాత్రమూ సరైనది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.
సాధారణంగా అంతా టీ(Tea)లో చక్కెర వేసుకుని తాగుతారు. దీనికి తోడు ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న రస్కులు, బిస్కెట్లు, బ్రెడ్ లాంటివి వేసుకుని తింటుంటారు. ఇలా చేయడం వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇవన్నీ దాదాపుగా మైదాతో తయారవుతాయి. అందువల్ల వీటిలో కార్బోహైడ్రేట్లతో పాటు గ్లూటెన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇలా చక్కెర స్థాయిలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్(Glucose) స్థాయిల్లో ఒక్కసారిగా హెచ్చుదల కనిపిస్తుంది. అది బరువు పెరగడం, మధుమేహం లాంటి అనారోగ్యాలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యులు చెబుతున్నారు. “ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్” ప్రకారం.. రెండు సంవత్సరాల పాటు రోజుకు రెండు రస్క్‌లు తిన్నవారు 2.5 కిలో బరువు పెరిగారు. అలాగే జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం.. డైలీ రెండు రస్క్‌లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని తేలింది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు లేకపోలేదని వెల్లడైంది.