People who work from home are like this..?Photos released by AI
work from home: కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దాదాపు అన్నీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) ఇచ్చేశాయి. ఇప్పటికీ కొన్ని ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది. మీరు ఇంటి నుంచి పని చేస్తే ఇలా ఉంటారని ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హెచ్చరిస్తోంది. ఇలా మారతారని కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దీంతో మీ జీవన శైలిలో మార్పులు వస్తాయని స్పష్టం అవుతోంది.
90 శాతం ఉద్యోగుల్లో..
వర్క్ ఫ్రమ్ హోం (work from home) చేసే వారిలో 90 శాతానికి పైగా ఉద్యోగుల ఇళ్లలో సరైన ఏర్పాట్లు లేవు. ఇంటిలో చైర్ లేదంటే బెడ్ (BED) మీద కూర్చుంటారని పేర్కొంది. ఆఫీసులో (OFFICE) అయితే టేబుల్స్, డెస్క్ టాప్, నెట్ బాగుంటాయని వివరించింది. ఫర్నీచర్ ఎట్ వర్క్ అనే కంపెనీ ఓ మోడల్ అన్నా పేరుతో ఇమేజ్ సృష్టించింది. ఆమె ఎక్కడ పడితే, ఎప్పుడు పడితే అలా వర్క్ చేసిందని పేర్కొంది.
సమస్యలివీ..
అలా వర్క్ చేయడంతో ఆమె మెడం పెద్దగా కావడం, కళ్ల కింద నల్లని వలయం, పక్షి కాళ్లలా మారిన చేతివేళ్లు, ఊబకాయ సమస్య తలెత్తాయి. ఇంటి నుంచి పనిచేసే వారిలో మూడో వంతు మందికి సరైన వర్క్ స్పేస్ లేకుండా పనిచేస్తున్నారని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ అధ్యయనం ఆధారంగా ‘అన్నా’ పాత్రను సృష్టించారు. అన్నా ఎక్కువగా మంచం మీద కూర్చని పనిచేసేదని.. రోజుకు 18 గంటలు కంప్యూటర్ చూసేదని ఏఐకి ఇన్ ఫుట్ ఇచ్చారు. దాంతో పెద్ద వయస్సు వచ్చాక అన్నా ఎలా ఉంటుందో ఏఐ ఫోటోలు డిజైన్ చేసింది.
20-20-20 ఫార్మూలా
మీరు అన్నాలా (ANNA) మారొద్దని అనుకుంటే.. ఇంటి నుంచి పనిచేసేవారు స్వల్ప విరామం తీసుకోవాలని కోరుతున్నారు. కళ్లను కాపాడుకోవడానికి 20-20-20 సూత్రాన్ని అమలు చేయాలని చెబుతున్నారు. 20 నిమిషాలు కంప్యూటర్ మీద వర్క్ చేశాక.. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలని సజెస్ట్ చేశారు. ఆఫీసులో ఎలాంటి వాతావరణం ఉందో.. ఇంట్లో కూడా పని చేసే చోట అలానే ఉండాలని పేర్కొంది. లైటింగ్, చైర్ పొజిషన్, డెస్క్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు.