TG: HYD నగరవాసులు ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ వెజ్ వీక్, నో అవుట్ సైడ్ ఫుడ్ వంటి కొత్త పద్ధతులను పాటిస్తున్నారు. ముఖ్యంగా యువత ఇంటి భోజనానికే ప్రాధాన్యతనిస్తోంది. ఆఫీసుల్లో సహోద్యోగులందరూ కలిసి హోమ్ ఫుడ్ డేస్ నిర్వహించడం ఇప్పుడు నగరంలో ఒక సరికొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌గా మారింది.
చాలామందికి కాఫీతోనే రోజు ప్రారంభమవుతుంది. కాఫీ వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచి అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ కాఫీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెటాబాలిజాన్ని పెంచి శరీరంలో నిల్వైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
జిమ్‌కి వెళ్లలేకపోయినా రోజుకు 20 నిమిషాలు ఇంట్లోనే వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. మధుమేహం వంటి వ్యాధుల ముప్పును తగ్గించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. శారీరక దృఢత్వంతో పాటు మెరుగైన మూడ్ సొంతమవుతుంది.
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు నౌకాసనం ఉత్తమమైనది. నేలపై వెల్లకిలా పడుకుని గాలి పీలుస్తూ కాళ్లు, ఛాతి భాగాన్ని ఒకేసారి గాలిలోకి లేపి చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగి అక్కడ పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఇది బరువు తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వెన్నెముకను దృఢంగా మార్చడంలో కూడా తోడ్పడుతుంది.
కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్.. *చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
వ్యాధి రాకుండా ముందుగా వేసుకునేది వ్యాక్సిన్. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్‌లతో పోరాడుతుంది. అదే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత నయం చేయడానికి వాడేవి మందులు. టీకాలను వైరస్ లేదా బ్యాక్టీరియా జన్యువుల నుంచి తయారు చేస్తారు. మెడిసిన్స్‌ను రసాయనాలతో రూపొందిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యాక్సిన్ నిరోధిస్తుంది, మెడిసిన్ చికిత్స చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఉదయం టీ/కాఫీలో చక్కెర బదులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవడం లేదా దాల్చిన చెక్క పొడి కలిపిన నీళ్లు తాగడం మంచిది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడం ద్వారా ఉబ్బరం, గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఆకలి వేయడం సహజం. ఈ సమయంలో చాలామంది సమోసాలు, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ తింటారు. దీంతో కొవ్వు, గ్యాస్ సమస్యలు వస్తాయి. వాటికి బదులు బాదం, వాల్‌నట్స్, వేయించిన శనగలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు అందించి ఆకలిని తీరుస్తాయి. ఈ ఆరోగ్యకరమైన అలవాటు బరువును నియంత్రించడమే కాకుండా, రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
కంటి తెల్లసొనపై అకస్మాత్తుగా కనిపించే ఎర్రటి మచ్చను ‘సబ్ కంజంకైవల్ హేమరేజ్’ అంటారు. ఇది రక్తనాళం పగిలి రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడుతుంది. గట్టిగా దగ్గడం, తుమ్మడం లేదా హైబీపీ వల్ల ఇలా జరుగుతుంది. ఇది చూపుపై ప్రభావం చూపదు. ఒకటి రెండు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ నొప్పిగా ఉన్నా, చూపు మసకబారినా వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది.
కుండ నీరు శరీరానికి చలువ చేస్తాయి. మట్టి కుండలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి ప్రసరించి, నీరు సహజంగానే చల్లబడుతుంది. ఇక ఈ నీరు తాగడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంట, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి మట్టి కుండ నీరు గొప్ప వరం. శరీరంలోని మెటబాలిజం రేటు పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
వేసవిలో శరీరం తరచూ అలసట, డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వీటిని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం వల్ల బీపీ అదుపులో ఉండి, కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి. ఇంకా శరీర వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం.
వేసవి ఎండలతో కిడ్నీలకు ముప్పు పొంచి ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల శరీరం చల్లబడటానికి రక్తం చర్మం వైపు మళ్లుతుంది, దీనివల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గి (రీనల్ హైపోపెర్ఫ్యూజన్) అవి దెబ్బతింటాయి. డీహైడ్రేషన్‌తో విషతుల్యాలు పేరుకుపోయి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు (CKDu) దారితీయవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, ఎండలో పనిచేసేవారు, మధుమేహం ఉన్నవారు అప్రమత్తంగా ఉండి తగినంత నీరు తాగాలి.
వంటల్లో సాధారణ ఉప్పు బదులు పింక్ సాల్ట్ ఉపయోగించడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన అన్ని మినరల్స్‌తో నిండి ఉంటుందని, జీర్ణ ఎంజైములను ప్రేరేపించి జీర్ణక్రియను సులభతరం చేస్తుందంటున్నారు. అలాగే BP నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని, శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మానికి ఎంతో మేలు చేస్తుందట.
RO పద్ధతిలో నీటిని వడకట్టినప్పుడు కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పోతాయి. చాలా తక్కువ TDS ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే గుండె సమస్యలు, ఎముకల బలహీనత వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ ఖనిజాల లోపాన్ని సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా భర్తీ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.