»Eating Garlic On A Regular Basis Has Amazing Health Benefits
Health Tips: పరగడుపున వెల్లుల్లి తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లి(Garlic) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను పటిష్టంగా మారుస్తుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఈ రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యం(Health)పై శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల వారు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. అనేక రోగాల నుంచి ఉపశమనం పొందడానికి మన ఇంట్లో వంటగదిలో ఉండే మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి(Garlic). ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను పటిష్టంగా మారుస్తుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉంటాయి.
వెల్లుల్లి(Garlic)లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అందుకే డయాబెటిక్(Diabetics) పేషెంట్లు రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అధిక బరువు(Heavy Weight)తో బాధపడేవారు ప్రతి రోజూ కూడా ఖాళీ కడుపుతో వెల్లుల్లి(Garlic) రెబ్బలను తింటే చాలు. అవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపుతుంది. మానసికంగా బాధపడుతున్నవారికి వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు(BP)ను తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి(Garlic) రెబ్బను తింటే రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దాని వల్ల గుండె(Heart) కూడా ఆరోగ్యంగా ఉంటుంది.