»Dengue Preventions Tips Just Drink These Immune Boosting Drinks
Dengue: డెంగ్యూ నివారణ చిట్కాలు..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి పెరిగింది. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కోల్కతా సహా రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
డెంగ్యూ వ్యాధి వర్షాకాలం తర్వాత ప్రతి సంవత్సరం ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ అంటు వ్యాధి ప్రతి సంవత్సరం ఎంతో మందిని ఇబ్బంది పెడుతూనే ఉంది. కాబట్టి వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా సోకిన ఈడిస్ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సంక్రమణ తీవ్రంగా వ్యాపిస్తుంది. అందువల్ల ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే పరిస్థితి తలెత్తవచ్చు.
తేలికపాటి సందర్భాల్లో కోలుకోవడానికి 2-3 వారాలు పట్టవచ్చు. మందులతో పాటు కొన్ని ఆహార మార్పులు డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి మీకు సహాయపడతాయి. ఇది శరీరంలో కోల్పోయిన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. డెంగ్యూ జ్వరం నుంచి కోలుకుంటున్న వారు పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. కాబట్టి డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు:డెంగ్యూ జ్వరం నుండి కోలుకునేటప్పుడు బాగా హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. ఎందుకంటే ఈ వ్యాధి అధిక జ్వరం, వాంతులు, విరేచనాల కారణంగా నిర్జలీకరణానికి దారితీస్తుంది. ప్రతిరోజూ కనీసం 6-8 గ్లాసుల నీరు తాగటం ఎంతో ముఖ్యం.
పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపును గోరువెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పండ్ల రసాలు: ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. నారింజ, నిమ్మ, బొప్పాయి వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్ల రసాలు మీ రోగనిరోధక వ్యవస్థకు మెరుగుపరుస్తాయి.
అలోవెరా జ్యూస్: రోగ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్న కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణ రుగ్మతలు తగ్గుతాయి. డెంగ్యూ తీవ్రమైన అనారోగ్యం అని గుర్తుంచుకోండి. మందులతో పాటు, లక్షణాలను తగ్గించడానికి, కోలుకోవడానికి మీకు సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం అని మర్చిపోకండి.