గుండె మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. హృదయం ఆరోగ్యంగా ఉంటే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందించవచ్చు. కానీ హృదయం సంతోషంగా లేకుంటే జీవితంలోని ప్రతి క్షణం ఏదోక ఇబ్బందితో ఉంటుందని అర్థం. అటువంటి పరిస్థితిలో గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గత కొద్ది రోజులుగా గుండె సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మీ ఆహారం మంచిగా ఉంటే, మీరు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు మీ ఆహారంలో పొటాషియం, విటమిన్ కె, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలను చేర్చుకోవాలి. ఈ పోషకాల లోపం మీలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ఈ పోషకాలను ఆహారంలో చేర్చండి
ఈ రోజుల్లో ప్రోటీన్ , విటమిన్లపై మాత్రమే అందరూ దృష్టి పెడుతారు. అయితే ఆరోగ్యకరమైన గుండె కోసం ఆహారంలో కొన్ని పోషకాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, కాల్షియం తీసుకోవడం ఎంతో ముఖ్యం.
మెగ్నీషియం
మెగ్నీషియం ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉన్నప్పుడు, హృదయ స్పందన నియంత్రణలో ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం లోపం గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్, తక్కువ ఫ్యాట్ యాకుట్, అరటిపండు, అవకాడో వంటి ఆహారాలను తింటే మంచి ఫలితం ఉంటుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఇది వాపును తగ్గిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడం, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒమేగా -3 కొవ్వులు హృదయ స్పందన రేటును కంట్రోల్ లో ఉంచుతాయి. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
కాల్షియం
శరీరంలో క్యాల్షియం నియంత్రణలో ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కాల్షియం లోపం రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీ ఆహారంలో పెరుగు, పాలు, బలవర్థకమైన తృణధాన్యాలు, సోయాబీన్స్ వంటివి తింటే కాల్షియం లోపాన్ని నివారించవచ్చు.
పొటాషియం
గుండె జబ్బుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో పొటాషియం రక్తపోటు రాకుండా చూస్తుంది. శరీరంలో పొటాషియం లోపిస్తే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.