Jr.NTR : ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ స్పీచ్ కోసం వెయిటింగ్!
Jr.NTR : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రుతులూగించిన కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డ్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. దాంతో ట్రిపుల్ ఆర్ టీం గాల్లో తేలుతోంది. ఇక ఆస్కార్ వేడుక అయిపోవడంతో.. ఇండియాకు తిరిగి వచ్చేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్.
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రుతులూగించిన కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డ్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. దాంతో ట్రిపుల్ ఆర్ టీం గాల్లో తేలుతోంది. ఇక ఆస్కార్ వేడుక అయిపోవడంతో.. ఇండియాకు తిరిగి వచ్చేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. అయితే వచ్చి రాగానే ఇక్కడ భారీ సెలబ్రేషన్ ఈవెంట్ ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా దీనిపై క్లారిటీ లేదు గానీ.. విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా గెస్ట్‌గా మాత్రం రాబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే మాస్ కా దాస్.. తన అభిమాన హీరో వస్తున్నాడంటూ ప్రకటించేశాడు. మార్చి 17న ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. మార్చి 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయినా ఇప్పటి వరకు పెద్దగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు విశ్వక్. ఎందుకంటే.. తన ఈవెంట్‌కు ఎన్టీఆర్ వస్తే ఆటోమేటిక్‌గా భారీ హైప్ రావడం పక్కా. పైగా ఆస్కార్ అందిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ వస్తున్న ఈవెంట్ ఇదే. అందుకే విశ్వక్ సేన్‌కు ఎన్టీఆర్ ఆస్కార్ క్రేజ్ మరింతగా కలిసొచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో.. ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ ఇవ్వబోయే ఫస్ట్ స్పీచ్ కోసం వెయిటింగ్ అంటున్నారు అభిమానులు. నిన్న మొన్నటి వరకు హాలీవుడ్ మీడియాలో హల్చల్ చేశాడు తారక్. దాంతో ధమ్కీ వేదికపై యంగ్ టైగర్ స్పీచ్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ధమ్కీ మూవీకి.. ఎన్టీఆర్ ప్రమోషన్స్ మరింతగా కలిసి రానుంది. మరి ఫ్యాన్స్‌కు తారక్ ఎలాంటి బూస్టింగ్ ఇస్తాడో చూడాలి.