Tomato And Ginger: వంట గదిలో అల్లం (Ginger) పేస్ట్, అల్లం ముక్క.. టమాట (Tomato) కంపల్సరీ. ఇవీ డైలీ వారీగా యూజ్ చేస్తుంటారు. అల్లం ధర కాస్త అటు ఇటుగా ఉంటుంది. టమాట ధర మాత్రం అప్పుడే పెరుగుతోంది. తగ్గడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అల్లం, టమాట (Tomato) రెండు కూడా ధరల విషయంలో పోటీ పడుతున్నాయి. ఆ రెండు కొనాలంటే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇటీవల ఉత్తర భారతదేశంలో అకాల వర్షాలు కురిశాయి. దీంతో టమాట (Tomato) పంట దెబ్బతింది. అల్లం రైతులు మాత్రం గత ఏడాది నష్టాన్ని చవిచూశారు. ఆ నష్టం పూడ్చుకునేందుకు ధర పెంచుతున్నారు. దీంతో టమాట (Tomato), అల్లం (Ginger) ధరలు పెరుగుతున్నాయి. 15 రోజుల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో టమాట (Tomato) రూ.40 ఉండగా.. ఇప్పుడు కిలో రూ.80కి పెరిగింది. ఆజాద్ పూర్ మార్కెట్లో వర్షం వల్ల టమోట దెబ్బతినడం వల్ల సరఫరా తగ్గింది. కొత్త పంట వచ్చేంత వరకు ధరలు పెరుగుదల ఉంటుంది. దక్షిణ భారతదేశం నుంచి టమోటలకు (Tomato) విపరీతమైన డిమాండ్ ఉందని.. అందుకే ధరల పెరుగుదల ఉందని ఆజాద్ పూర్ టమాట (Tomato) ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి టమోటలు వస్తున్నాయని వివరించారు. రెండు నెలల పాటు ధరల పెరుగుదల తప్పేలా లేదని చెబుతున్నారు.
అల్లం (Ginger) ధర కూడా భారీగా పెరిగింది. ఇంతకుముందు 100 గ్రాముల అల్లం (Ginger) రూ.30 ఉండేది. ఇప్పుడు దాని ధర రూ.40కి పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు లేదు. ఈ సారి జాగ్రత్తగా పంట వేశారు. పంట తక్కువ కావడం.. డిమాండ్ ఎక్కువ ఉండటంతో ధరల పెరుగుదల ఉందని అఖిల భారత కూరగాయాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ గద్వే తెలిపారు. దేశ వార్షిక అల్లం (Ginger) ఉత్పత్తి 2.12 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న సంగతి తెలిసిందే.