ఇంట్లో ఫుడ్ నచ్చడం లేదని హోటల్‌కి వెళ్తున్నారా..? జర జాగ్రత్త. కొన్ని హోటల్స్ శుచి, శుభ్రత పాటించడం లేదు. రుచి కోసం రంగులు చల్లి, కాచిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారని తెలిసింది. సో.. ఇంటిపట్టున చక్కని భోజనం ప్రిపేర్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Stored Food:రుచి కోసం హోటల్స్ (hotels), రెస్టారెంట్‌కు వెళ్లడం కామన్. పేరున్న హోటళ్లలో ఫుడ్ బాగుంటుంది. అయితే కొన్ని మాత్రం ప్రమాణాలను పాటించడం లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ విషయంలో రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతున్నారు. వాటిని ఉడికించి.. ఉడికించి మరీ సేల్ చేస్తున్నారు. దీంతో ఆ ఆహార పదార్థాలు తీసుకున్న జనం.. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలవుతున్నారు.
ఫుడ్ సేప్టీ (food safety) అధికారులు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదు. చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో జనం ప్రాణాలతో హోటల్ యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయి. కొన్ని హోటళ్లకు (hotels) లైసెన్స్ కూడా లేదనే విషయం తెలిసింది. అనంతపురం (anantapuram) జిల్లాలో 500 హోటళ్లు ఉంటే కేవలం 200 హోటల్స్‌కు మాత్రమై లైసెన్స్ ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 350 హోటళ్లలో 150కి మాత్రమే లైసెన్స్ ఉన్నాయి. ఇక చిన్న చిన్న హోటళ్ల సంగతి లెక్కే లేదు.
ఆహార పదార్థాలను సరిగా శుభ్రం చేయడం లేదు. కొన్నింటిని సరిగా ఉడికించడం లేదని తెలిసింది. వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడటం కూడా ఇబ్బందికర పరిస్థితికి దారితీసింది. రంగులు వేసి.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. చీజ్, బటర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే బ్యాక్టీరియా చేరుతుంది. కలుషిత నీళ్ల ద్వారా బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది.
టోటల్ పోలార్ కౌంట్ (TPC) ఫెయిల్ అయితే హోటళ్లపై చర్యలు తీసుకుంటారు. కౌంట్ 25కి మించితే కేసు ఫైల్ చేస్తారు. 2 నెలల్లో 4 హోటళ్లపై కేసులు నమోదు చేశామని అనంతపురం ఫుడ్ సేప్టీ అధికారి చక్రవరి తెలిపారు.
నిల్వ ఉంచిన ఆహారంతో సమస్య ఉంటుందని.. బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజ్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. సో.. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
సో..హోటల్‌కి వెళ్లేముందు ఓ సారి ఆలోచించుకోండి. శుభ్రంగా ఇంటి వద్దే చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి. హోటల్ వెళ్లినా.. పరిశుభ్రత గురించి కనుక్కొని, చూసి మరీ ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.