Honey : తేనెను వీటితో కలిపి తీసుకోండి.. అద్భుతాలు చూస్తారు!
చాలా మంది ఉదయాన్నే కాస్త తేనెను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు. అయితే దీన్ని మరికొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల లాభాలు రెట్టింపవుతాయి. అవేంటంటే..?
Health Benefits of Honey : ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటూ చాలా మంది తేనెను తమ రోజు వారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. తేనె(HONEY), నిమ్మ రసం కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే అచ్చంగా తేనెను మాత్రమే తీసుకోవడం కంటే దానితో కొన్నింటిని కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు(HEALTH BENEFITS) ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
చాలా మందికి ఉదయాన్నే టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు వాటికి బదులుగా వేడి నీటిలో తేనెను(HONEY) కలిపి తాగవచ్చు. కావాలనుకుంటే అందులో నిమ్మరసం కూడా చేర్చుకోవచ్చు. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల మనలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బరువు తగ్గేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. శరీరంలో పేరుకుని ఉన్న వ్యర్థాలు అన్నీ బయటకు వెళ్లి బాడీ డిటాక్స్ అవుతుంది.
ఒక స్పూనుడు తేనెలో(HONEY) చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల కొలస్ట్రాల్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. చెడు కొలస్ట్రాల్ తగ్గి మంచి కొలస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం ఉన్న వారికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. తేనెలో తొక్కలు తీసిన వెల్లుల్లిని నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శ్వాస కోశ వ్యాధులు దరి చేరవు. రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది. అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, గుండె జబ్బులు, పంటి సమస్యల్లాంటివి తగ్గుతాయి.