వీరసింహారెడ్డితో మొదలైన మాస్ జాతర.. వాల్తేరు వీరయ్యతో మరింత ముదిరిపోయింది. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత నడిచింది. బాలయ్య కెరీర్లో 54 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని.. రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో వీర మాస్ బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. ఇక నెక్స్ట్ డే వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. మెగాస్టార్‌కు తోడుగా మాస్ మహారాజా రవితేజ నిలవడంతో.. మెగా మాస్ బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు. మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నాడు వాల్తేరు వీరయ్య. అయితే వీరసింహారెడ్డి మాత్రం నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ప్రకటించారు. ఓవర్సీస్‌లోను వీరయ్యదే హవా.. ఇప్పటి వరకు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1.7 మిలియన్ యూఎస్ డాలర్స్‌ను దాటేసింది. వీరసింహారెడ్డి మాత్రం 1 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. ఈ లెక్కన వీరసింహారెడ్డి వసూళ్లు భారీగా డ్రాప్ అయినట్టే. అదెలాగా.. వాల్తేరు వీరయ్య కంటే ఒక రోజు ముందుగానే వీర సింహా రెడ్డి బరిలోకి దిగింది. అయినా కూడా కలెక్షన్లలో తేడా ఉందనే.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం కోసమే.. బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల పోస్టర్స్ రిలీజ్ చేసినా.. వసూళ్ల తేడా చూసి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇవన్నీ ఫేక్ కలెక్షన్లనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం.. మేకర్స్ వదిలిన పోస్టర్స్ చూసి.. సంక్రాంతి విన్నర్ చిరంజీవి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది బాలయ్య ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా చేస్తోంది. అయితే వీరసింహారెడ్డికి థియేటర్లు తగ్గిపోయాయని వాపోతున్నారు బాలయ్య ఫ్యాన్స్. కానీ ఓవరాల్‌గా వాల్తేరు వీరయ్యకే కలెక్షన్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.