ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ మూవీ రాబోతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇక ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయ్యినట్లు తెలుస్తోంది. సుమారుగా రెండు గంటల ముప్పై నిమిషాల నిడివితో వాల్తేరు వీరయ్య రాబోతున్నాడట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహంచబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 8న వైజాగ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. విశాఖ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అందుకే వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్‌కు మెగా ఫ్యాన్స్ భారీగా తరలిరానున్నారు. రవితేజ కూడా వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాబట్టి మాస్ మహరాజా ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున రావడం పక్కా. అందుకే మెగా, మాస్ రాజా ఫ్యాన్స్ కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ అందుకు రంగం సిద్దం చేసిందని టాక్. త్వరలోనే ఈవెంట్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.