మెగాస్టార్ చిరంజీ నటించిన ‘వాల్తేరు వీరయ్య’కు పని చేసిన వారంతా అంచనాలను పెంచుతునే ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ మెగా ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తున్నాడు. అందుకు తగ్గట్టే డైరెక్టర్ బాబీ, మెగాస్టార్‌ను వింటేజ్ లుక్‌లో ప్రజెంట్ చేస్తూ కిర్రెక్కిస్తున్నాడు. పైగా మాస్ మహారాజా కూడా మెగాస్టార్‌కు తోడవ్వడంతో.. ఈసారి థియేటర్ యాజమాన్యం మెగా ఫ్యాన్స్‌ను తట్టుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఇక తాజాగా వచ్చిన సెన్సార్ టాక్ కూడా అదిరిపోయేలా ఉంది.. దాంతో చిరు చెప్పినట్టే.. సినిమా పై అంచనాలను పెరుగుతునే ఉన్నాయి. వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్.. మెగాస్టార్ కామెడీ టైమింగ్ అదరహో అనేలా ఉన్నట్టు టాక్. ఇక సెకండ్ హాఫ్‌లో రవితేజ రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు. చిరు, రవితేజ మధ్య వచ్చే సీన్స్.. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తుందట. ఒక్క మాటలో చెప్పాలంటే.. వాల్తేరు వీరయ్య మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇవ్వబోతోందని అంటున్నారు. అందుకే కాబోలు.. కాస్త ముందుగానే పార్టీ చేసుకున్నారు మెగాస్టార్. న్యూ ఇయర్ సందర్భంగా చిరంజీవి ఇంట్లో వాల్తేరు వీరయ్య టీమ్‌కు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చిరంజీవి, రవితేజతో పాటు సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి వాల్తేరు వీరయ్య ఎలా ఉంటుందో చూడాలి.