ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ హిట్ టాక్ వచ్చినా.. సోసోగానే నిలిచింది. అందుకే వాల్తేరు వీరయ్య కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. పైగా మెగాస్టార్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అందుకే ఈ బొమ్మ థియేర్లోకి ఎప్పుడొస్తుందా.. అనే ఆతృతతో ఉన్నారు. డైరెక్టర్ బాబీ కూడా సినిమా పై భారీ హైప్ ఇస్తున్నారు. దాంతో అమెరికాలో దూకుడు చూపిస్తున్నాడు వాల్తేరు వీరయ్య. తాజాగా ఈ సినిమా యూఎస్ఏ ప్రీ బుకింగ్స్ సేల్స్ 100K డాలర్స్‌ను క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు పది రోజులుండగానే 100కె కొట్టేసిందంటే.. రిలీజ్ వరకు వీరయ్య వసూళ్లు గట్టిగానే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు.. చిరుకంటే ముందే.. బాలయ్య వీరసింహారెడ్డి 100 కె డాలర్స్ క్రాస్ చేసేసింది. ఈ లెక్కన అమెరికాలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి హంగామా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చిరు, బాలయ్య ఫ్యాన్స్ ‘తగ్గేదేలే’ పేరుతో పార్టీ చేసుకొని మరీ గొడవ పడ్డటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ కొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే.. ప్రస్తుతం వీరయ్య చిత్ర యూనిట్ ప్రమోషన్లో బిజీ బిజీగా ఉంది. ఇటీవలే ప్రీ రిలీజ్ రేంజ్లో ప్రెస్‌మీట్ కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్‌లో ఉన్నారు. జనవరి 8న వైజాగ్‌లో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.