విజయ్ దేవరకొండకు సరైన హిట్ లేక చాలాకాలమే అయింది. భారీ ఆశలు పెట్టుకున్న లైగర్ అంతంత మాత్రమే అనిపించగా.. జనగణమన కూడా వాయిదా పడింది. దీంతో అటు పూరీ, ఇటు దేవరకొండ బాగా డిస్టర్బ్ అయ్యారు. అయితే విజయ్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు విజయ్ దేవరకొండ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు దేవరకొండ. శివ నిర్వాణతో చేస్తున్న ఖుషి సినిమా ఇంకా లేటయ్యే ఛాన్స్ ఉండటంతో మరో సినిమాను ప్రకటించేశాడు. ఆ పోలీస్ డ్రెస్ లో షాడోలా కనిపిస్తున్న విజయ్ లుక్ ఈ మూవీలో అదిరిపోనుందట.
జెర్సీ డైరెక్టర్ తిన్ననూరి గౌతమ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ మూవీతో త్వరలో పోలీస్ గెటప్ లో విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం గౌతమ్ ముందుగా రామ్ చరణ్ ని కలవగా.. వేరే ప్రాజెక్టుల కారణంగా చరణ్ నో చెప్పాడట. దీంతో.. విజయ్ దేవరకొండ అయితేనే దీనికి కరెక్టుగా సూట్ అయితాడని భావించిన గౌతమ్ విజయ్ తో కమిట్ అయిపోయాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. స్పై థ్రిల్లర్ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. చూడాలి మరి.. దేవరకొండ ఈ సినిమాతో అయినా తన ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తాడా.. లేదా అని.