నందమూరి నటసింహం బాకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్దమైంది. భారీ బందోబస్తు మధ్యన ఒంగోలులో ఈ ఈవెంట్ జరుగుతోంది. మరికాసేపట్లో ఘనంగా ఈ వేడుక జరగనుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ తాకిడిని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఏబీఎమ్ గ్రౌండ్స్ నుంచి అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌కి ఈవెంట్‌ను మార్చారు. అయినా పోలీసులు పలు కండీషన్స్ పెట్టారట. ఇప్పటికే ఒంగోలు లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారట. ఈ ఈవెంట్ కోసం సుమారు 1000 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పాస్ ఇష్యూ చేసిన వారిని మాత్రమే అనుమతించాలని సూచనలు జారీ చేశారట. ఎంటర్, ఎగ్జిట్ దారుల్లో పటిష్టమైన బారీకేడ్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలాగే వృద్ధులను, పిల్లలను లోనికి అనుమతించకూడదని చెప్పారట. ఈవెంట్ ప్రాంగణంలో సినిమా తప్ప.. ఇతర రెచ్చగొట్టే నినాదాలు చేయకూడదని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట పోలీసులు. అంతేకాదు.. ఈ ఈవెంట్ లో జరిగే ప్రతి విషయానికి ఈవెంట్ నిర్వాహకులే పూర్తి బాధ్యులని ముందే చెప్పారట పోలీసులు. అయినా బాలయ్య ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదని తెలుస్తోంది. ఇక బాలయ్య ఈ ఈవెంట్ కోసం హెలికాప్టర్లో రానున్నాడు. వేదిక పై బాలయ్య ఎంట్రీని నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేశారట. దాంతో ఈ ఈవెంట్ ఓ పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ వేదిక పైనే వీరసింహారెడ్డి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి రానుంది.