పెళ్లి సందడి తర్వాత ధమాకాతో మంచి హిట్ అందుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. మాస్ మహారాజా రవితేజ సరసన దుమ్ముదులిపేసింది. ఆమె డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. దాంతో శ్రీలీల టాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాతో పాటు.. రామ్, బోయపాటి శ్రీను పాన్ ఇండియా ప్రాజెక్ట్.. నితిన్-వక్కంతం వంశీ సినిమాలోనూ నటిస్తోంది. అలాగే నవీన్ పోలిశెట్టితోను ఓ సినిమా చేస్తోంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. అయితే ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకుందా లేదా.. అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB 28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇందులో మరో బ్యూటీకి కూడా ఛాన్స్ ఉందని చాలా రోజులుగా వినిపిస్తోంది. పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించినప్పటికీ.. శ్రీలీల దాదాపుగా ఫైనల్ అయిందని వార్తలొచ్చాయి. కానీ శ్రీలీల మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దాంతో అసలు ఈ బ్యూటికి మహేష్ ఛాన్స్ ఇచ్చాడా.. లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. ఒకవేళ మహేష్‌తో ఆఫర్ అందుకుంటే.. ధమాకా ప్రమోషన్లో ఎక్కడో ఓ చోట రివీల్ చేసి ఉండేదని అంటున్నారు. కానీ మహేష్ సినిమా గురించి చెప్పలేదు. దాంతో శ్రీలీలకు మహేష్ ఛాన్స్ ఇవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీని పై అమ్మడు క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.