ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. 2022లో శ్యామ్ సింగారాయ్, అంటే సుందరానికి.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని.. ప్రస్తుతం ‘దసరా’ అనే ఊర మాస్ మూవీలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది. నాని కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. పాన్ఇండియా స్థాయిలో 2023 మార్చి 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక దసరా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు నాని. తన కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ వివరాలను.. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా జనవరి 1, సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. నాని 30 కూడా డెబ్యూ డైరెక్టర్‌తోనే చేయబోతున్నట్టు టాక్. అయితే హీరోయిన్ మాత్రం దాదాపుగా ఫిక్స్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో సీతారామం ముందు వరుసలో ఉంటుంది. ఇందులో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. దాంతో అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. మధ్యలో పలువురు హీరోల సరసన సీత ఛాన్స్ అందుకుందని వినింపించినా.. అధికారిక ప్రకటన రాలేదు. అయితే నాని 30 ప్రాజెక్ట్‌లో మాత్రం దాదాపుగా మృణాల్ ఠాకూర్ ఓకే అయిందని టాక్. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే వరకు ఆగాల్సిందే.