కొంత కాలం సరైన సక్సెస్‌లు అందుకోలేకపోయినా నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు. మల్లిడి వశిష్టని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బింబిసారుడిగా, దేవదత్తుడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడు కళ్యాణ్. అయితే ఇప్పటికు వరకు డబుల్ రోల్ మాత్రమే చేసిన ఈ హీరో.. ఇప్పుడు త్రిపుల్ డోస్ ఇవ్వబోతున్నాడు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అమిగోస్’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతుతున్నాడు. ఇందులో మూడు విభిన్నమై పాత్రల్లో కనిపించబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఓ పాత్రని పరిచయం చేశారు. తాజాగా మరో పాత్రకు సంబంధించిన లుక్‌ని రివీల్ చేశారు. ఫస్ట్ లుక్‌ను The Doppelganger 1 అంటూ రిలీజ్ చేసిన పోస్టర్లో కళ్యాణ్ రామ్ బిజినెస్ మాన్ సిద్దార్థ్‌గా కనిపించాడు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లో చాలా స్టైలిష్‌గా కనిపించాడు కళ్యాణ్ రామ్. ఈలుక్ని The Doppelganger 2 అంటూ లాంచ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మంజునాథ్‌గా కనిపించాడు. పూర్తిగా క్లాస్ లుక్‌లో కనిపించాడు. దాంతో మరో పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను మొదలైంది. త్వరలోనే ఆ లుక్ కూడా రివీల్ చేయనునున్నారు. అలాగే టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి అమిగోస్గా కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.