»Second Song Promo Release From Superstar Rajinikanths Jailer
Rajanikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ నుంచి రెండో సాంగ్ ప్రోమో రిలీజ్
జైలర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన తమన్నా సాంగ్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్(Super star Rajanikanth) చేస్తున్న తాజా ప్రాజెక్ట్ జైలర్ (Jailer Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం(Director Nelson dilip Kumar)లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను(Post productions works) శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో ప్రమోషన్స్(Pramotions) వర్క్‌ను కూడా మేకర్స్ స్టార్ట్ చేశారు.
తాజాగా జైలర్ మూవీ(Jailer Movie) నుంచి తమన్నా(Tamannah) సాంగ్ నువ్వు కావాలయ్య విడుదలై మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. తొలిపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో కోట్లాది మంది ఈ సాంగ్ చూసి రీల్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అదే జోరుతో మరో పాటను కూడా విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయిపోయారు.
జైలర్ నుంచి ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్:
హుకుం అనే సాంగ్(Hukum song Release)కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట ఫుల్ సాంగ్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రోమోలో.. ఏయ్ ఇక్కడ నేనే కింగ్..నేను చెప్పేవే రూల్స్..రూల్స్ తప్పితే ఎవర్నీ వదిలిపెట్టను. ఇది హుకుం..టైగర్ కా హుకుం అంటూ రజనీ తన స్టైల్ లో డైలాగ్స్ చెబుతాడు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 10వ తేదిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.