ఆర్సీ 15కి మధ్యలోనే బ్రేక్ పడితే ఏం చేయాలో ముందే ఆలోచించారు రామ్ చరణ్, దిల్ రాజు. అనుకున్నట్టే మధ్యలోనే ఇండియన్ 2 మొదలు పెట్టాడు శంకర్. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో.. ఇండియన్ 2ని ఏ మాత్రం లేట్ చేయకుండా.. తిరిగి పట్టాలెక్కించారు. దాంతో ఆర్సీ 15 అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అవలేదు. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్‌ను ఈక్వల్‌గా షూట్ చేస్తున్నాడు శంకర్. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా కియారా, సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమలో ఉన్నారు. ఈ జంట ఎప్పుడూ ఓపెన్ అవకపోయినా.. ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్తుంటారు.. బాలీవుడ్ సెలెబ్రిటీల ఇంట్లో జరిగే ప్రైవేట్ వేడుకలకు వెళ్తుంటారు. కాబట్టి నో డౌట్.. ఈ క్రమంలోనే పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. గతంలోనే ఫిబ్రవరి 6న రాజస్థాన్‌లో వీళ్ల పెళ్లి జరగనుందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇక ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసిందంటున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయట. ఇదే నిజమైతే.. ఆర్సీ 15కి మరికొన్ని రోజులు బ్రేక్ తప్పదు. ఇప్పటికే కియారా, శంకర్‌ను బ్రేక్ కావాలని కోరిందట. ఎంత కాదనుకున్నా నెల రోజులకు అటు, ఇటుగా కియారా బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది. దాంతో ఇండియన్ 2లాగే కియారా పెళ్లి వ్యవహారం కూడా ఆర్సీ 15ని మరింత లేట్ చేసేలా ఉందంటున్నారు. అంతేకాదు.. వచ్చే సంక్రాంతికైనా ఆర్సీ 15 రిలీజ్ ఉంటుందా లేదా.. అనే డౌట్స్ వస్తున్నాయి. మరి ఆర్సీ 15 టీమ్ షూటింగ్ అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.