ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు.. బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ ముద్దుగుమ్మ నటించిన విజయ్ ‘వారసుడు’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ చేస్తోంది. అయితే ఈ మధ్యలో రష్మిక ఓ ఐటెం సాంగ్ కూడా చేస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి. తాజాగా నందమూరి నటసింహంతో ఈ బ్యూటీ స్పెషల్ ఐటెం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి జనవరి 12న ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు బాలయ్య. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108 ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.. హీరోయిన్గా ప్రియాంక జవాల్కర్ పేరు వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఐటమ్ సాంగ్ కోసం రష్మిక పేరు తెరపైకి వచ్చింది. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలొ మహేష్‌తో రొమాన్స్ చేసింది రష్మిక. అందుకే బాలయ్యతో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందని టాక్. బాలయ్య కూడా అన్‌స్టాపబుల్ టాక్ షోలో రష్మిక తన క్రష్ అని చెప్పుకొచ్చారు. దాంతో నిజంగానే రష్మిక, బాలయ్యతో చిందేయడం పక్కా అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు రష్మిక సౌత్ సాంగ్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈసారి కన్నడ ఇండస్ట్రీతో పాటు.. సౌత్ ఇండస్ట్రీలు మొత్తం అమ్మడిని టార్గెట్ చేశాయి. మరి దీనిపై రష్మిక స్పందిస్తుందేమో చూడాలి.