ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, మారుతితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రాబోతోంది. రీసెంట్గా పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. అందుకే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నెనీ, సిద్ధార్థ్ ఆనంద్‌ను ప్రత్యేకంగా కలిశారు. ‘పఠాన్’ హిట్ సందర్భంగా అభినందించారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ ఫిక్స్ అని.. మరోసారి కన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టే. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సలార్ కూడా ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. ప్రాజెక్ట్ కె సగానికి పైగా షూట్ అయిపోయింది. మారుతి ప్రాజెక్ట్ కూడా ఒకటి, రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయినట్టు సమాచారం. దాంతో నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత ఆనంద్ సిద్ధార్థ్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నాడు ప్రభాస్. ఈ లోపు ఆనంద్.. హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ కంప్లీట్ చేయనున్నాడు. అయితే ప్రభాస్ సినిమాలో హృతిక్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం.. ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలుస్తుందని అంటున్నాయి సినీ వర్గాలు. బహుశా నెక్స్ట్ ఇయర్లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.