»Power Star Pawan Kalyan Bro Dance Pic Viral Social Media
Pawan kalyan: డ్యాన్స్ మామూలుగా ఉండదు ‘బ్రో’
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముందుగా 'బ్రో(BRO)' మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమాలో పవన్ డ్యాన్స్ మామూలుగా ఉండదని చెబుతు.. హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో(BRO)’ మూవీలో సాయి ధరమ్ తేజ్ మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ ‘బ్రో’ మూవీ పై మరింత బజ్‌ని జనరేట్ చేసింది. అసలు ఈ సినిమా పెద్దగా అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ అయింది. జస్ట్ 20 నుంచి 25 రోజుల్లోనే పవన్ ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీగ్ చేశారు. అందుకోసం రూ.45 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారు పవర్ స్టార్.
ఇక పవన్ కెరీర్లోనే ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుకొని, థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా..ఓపెనింగ్ డే కొత్త రీజనల్ బాక్సాఫీస్ రికార్డ్స్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఏం కావాలో.. అలాంటి మాస్ స్టఫ్‌తో బ్రో సినిమా ఆడియెన్స్ ముందుకి రాబోతోందని.. రోజుకో పిక్‌తో హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తమ్ముడు సినిమా గుర్తొచ్చేలా.. పవన్(pwan kalyan), సాయి ధరమ్ తేజ్ లుంగీ గెటప్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది.
ఇక ఇప్పుడు మరో వైరల్ పిక్‌ను రివీల్ చేశారు. సముద్రఖని షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో(pic).. జల్సా సినిమాలోని సంజయ్ సాహూను గుర్తుకు తెస్తోంది. సరిగమపదనిస.. కరో కరో జర జల్సా.. సాంగ్‌లోని స్టిల్‌ని రివీల్ చేశారు. అయితే.. బ్రో సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ని డిజైన్ చేశారు మేకర్స్. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఈ సాంగ్‌లో స్టెప్పులేసింది. తమన్ ట్యూన్ ఓ రేంజ్లో వచ్చిందని అంటున్నారు. ఈ సాంగ్‌లోనే తమ్ముడు, జల్సా సినిమాల్లోని వింటేజ్ పవన్‌ని చూపించబోతున్నారు. అందుకే ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ టాపుల్ లేచిపోవడం పక్కా అంటున్నారు.