బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన అభిమానులకు కీలక అప్‌డేట్ ఇచ్చారు. తన స్వీయ దర్శకత్వంలోని ‘క్రిష్ 4’ను ప్రస్తుతానికి పక్కనపెట్టిన ఆయన, కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’తో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది హృతిక్ కెరీర్‌లోనే తొలి సౌత్ ఇండియన్ సినిమా. ఈ చిత్రం పూర్తయ్యాకే ‘క్రిష్ 4’ పట్టాలెక్కుతుందని సమాచారం.
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరును ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ నటన, వెంకీ స్టైల్ మేకింగ్‌పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.
మళయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్ పొడ్యాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 2022లో తనను చిదంబరం వేధించినట్లు ఓ మహిళ ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల మళయాళ చిత్ర పరిశ్రమలో వరుసగా వెలుగులోకి వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
నటుడు, టీవీకే అధినేత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం సంచలనమైంది. విజయ్-సంగీతల విడాకుల వ్యవహారం, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం కుటుంబంలో విభేదాలకు సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా ఇటీవల భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కగా, విజయ్‌కు మరో మహిళతో సంబంధం ఉందని ఆమె ఆరోపణలు చేసింది.
దుబాయ్, ఖతార్ సహా ఏడు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో అక్కడ ఉన్న స్టార్ హీరోలు అజిత్, మాధవన్ భద్రతపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే వారిద్దరూ క్షేమంగా ఉన్నారని, ఎటువంటి ముప్పు లేదని వారి సిబ్బంది అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు సురక్షిత ప్రాంతంలో ఉన్నారని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన అంతర్జాతీయ చిత్రం ‘ది బ్లఫ్’పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాను చూసిన ఆయన, SM వేదికగా తన రివ్యూను పంచుకున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక నటన అద్భుతంగా ఉందని, పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిందని మహేశ్ కొనియాడాడు. గ్లోబల్ స్టార్ స్థాయికి తగ్గట్లుగా ప్రియాంక సత్తా చాటిందని పేర్కొన్నాడు.
నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో భారీ చిత్రం రాబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ‘సరిపోదా శనివారం’తో తన మాస్ యాంగిల్‌ను నిరూపించుకున్న వివేక్, బాలయ్య కోసం ఓ లార్గర్ దెన్ లైఫ్ కథను సిద్ధం చేశాడట. బాలకృష్ణకు ఇప్పటికే కథను కూడా వినిపించారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేసే ఆలోచనలో ఉన్నారట.
హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తనతో కలిసి పనిచేయడం కొంచెం కష్టమనే మాట వింటుంటానని తెలిపింది. ‘బహుశా నాతో పనిచేయని వ్యక్తులు ఇలా ప్రచారం చేసి ఉండొచ్చు. నేనేంటో అందరికీ నిరూపించుకోవాలని అనుకోను. అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా పనితోనే సమాధానం చెప్తా’ అని చెప్పుకొచ్చింది.
T20 ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం సాధించి సెమీస్‌కు చేరింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులతో వీరవిహారం చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజూపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రశంసలు కురిపించారు. ఇది అద్భుతమైన మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్ అని, సంజూ ప్రతిభకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం తర్వాత హైదరాబాద్‌లో ఈ నెల 4న గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని వారు కోరారు. సెక్యూరిటీ, పోలీసుల ఆంక్షల దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని, వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని, వారి దీవెనలు ఎక్కడున్నా తమకు చేరుతాయని ‘విరోష్’ జంట తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రూపొందింది. మార్చి 26, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అక్కడ మార్చి 25న ప్రీమియర్లు ప్రదర్శించనున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో ‘NBK111’ సినిమా రాబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 6 నుంచి ప్రారంభం కానుందట. తాజాగా బాలయ్య లుక్ టెస్ట్ జరిగినట్లు, ఈ మూవీలో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నట్లు టాక్. తన పాత్ర కోసం ఆయన స్లిమ్‌గా మారి, డిఫరెంట్ గెటప్పులతో అలరించబోతున్నారట. ప్రస్తుతం బాలయ్య తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై ఫోకస్ పెట్టారట.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. బెంగళూరులో దీని ట్రైలర్ మార్చి 8న విడుదల కానుంది. ఇక ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ నందమూరి బాలకృష్ణను కలిసి సినిమా విశేషాలను పంచుకున్నారు. బాలయ్య తన ఆశీస్సులు అందిస్తూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. గతంలో వరలక్ష్మి, బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో నటించిన సంగతి తెలిసిందే.
వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం ఆమె తండ్రి శరత్ కుమార్‌కు ఇష్టం లేదని రాధికా తెలిపింది. ‘సరస్వతి’ మూవీ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. వరలక్ష్మిని నటిగా తీసుకోవద్దని నిర్మాతలకు కూడా ఆయన చెప్పారని గుర్తు చేసుకుంది. వరలక్ష్మి నటన చూసి ఆమె గొప్ప నటి అవుతుందని చెప్పానని తెలిపింది, అంతేకాదు తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని ఆమెకు సలహా ఇచ్చినట్లు పేర్కొంది.