యుక్తవయసులో మాదకద్రవ్యాలను నిరోధించడంతోపాటు వారి తల్లిదండ్రలకు అవగాహన కల్పించే లక్ష్యంతో చిత్రం చేస్తున్న హీరో కృష్ణ సాయి(Krishna Sai)ని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(tamilisai soundararajan) అభినందించారు.
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా, సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు లెగసీని కంటిన్యూ చేసేందుకు.. ఆయ కుమారుడు గౌతమ్ రెడీ అవుతున్నాడు. తాజాగా గౌతమ్(Gautham) తెరంగేట్రం ఎప్పుడుంటుంది? అనే విషయంలో నమ్రత(namratha) క్లారిటీ ఇచ్చింది.
గుంటూరు కారం సినిమా గురించి భారీ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
అఫీషియల్ అప్డేట్స్ కంటే.. చిరు లీక్స్ అంటూ మెగాస్టార్ చేసే సందడి మామూలుగా ఉండదు. తన సినిమాల అప్డేట్స్ను లీక్ చేసి మెగాభిమానులకు కిక్ ఇవ్వడం చిరంజవీ స్టైల్. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్(bhola shankar) మూవీ నుంచి వస్తున్న చిరు లీక్స్(chiru leaks) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే నటి నందితా శ్వేత(nandita swetha) పుట్టిపెరిగింది కర్ణాటకలో కానీ సినిమాలు మాత్రం తమిళ్, తెలుగు భాషల్లో చేస్తుంది. అనేక చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఈ క్రమంలో ఈ అమ్మడు చిత్రాలు, బయోగ్రఫీ ఓ సారి చుద్దాం రండి.
ఆంధ్రప్రదేశం రాజకీయాలను ఉద్దేశించి నటీ పూనమ్ కౌర్ చేసిన ట్విట్ పై మండిపడుతున్న పవన్ అభిమానులు. బూతులు తిడుతూ రెచ్చిపోతున్న నెటిజనులు.
ప్రభాస్ 'సలార్' మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో దూసుకుపోతున్న సలార్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సలార్ అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల ఓ చిన్న టీజర్ రెండు రోజుల పాటు షేర్ చేయగా, అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
జైలర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన తమన్నా సాంగ్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ(vd13) మళ్లీ దర్శకుడు పరశురాంతో చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభించబడింది. తాత్కాలికంగా VD13 అని పేరు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బేబీ మూవీ విడుదల తర్వాత మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మీడియా నుంచి బోల్డ్ సీన్స్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటికి ఆమె ధీటుగా ఆన్సార్ చేయడం విశేషం.
ఆన్లైన్ వీడియోల ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఇండో-కెనడియన్ సింగర్ జోనితా గాంధీ. తన పాటలతోపాటు తన అందాలతో కూడా కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తుంది.
రష్మిక, భీష్మ కాంబోపై వచ్చిన రూమర్స్ మూవీ మేకర్స్ కొట్టిపారేశారు. నితిన్, వెంకీ కుడుముల నుంచి రష్మిక మందన్న(Rashmika mandanna) తప్పుకున్నట్లు ఇటీవల వచ్చిన పుకార్లు నిజం కాదని తెలిపారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన చివరగా నటించిన సర్కారువారి పాట బెడిసి కొట్టడంతో, గుంటూరు కారం హిట్ కావాలని ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ మూవీ కూడా షూటింగ్ నేపథ్యంలో ఆలస్యమౌతూ వస్తోంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టిన్టుగా మాట్లాడుతుంటాడు విశ్వక్. ఇక కాంట్రవర్శీలకైతే కొదవే లేదు. మనోడు ఏది చేసినా సినిమా ప్రమోషన్స్‌కు గట్టిగా కలిసొచ్చేలా చేస్తాడు. ప్రస్తుతం విశ్వక్ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశ్వక్.
గత కొన్ని రోజులుగా తలపతి విజయ్(thalapathy Vijay) రాజకీయ ప్రవేశం చర్చనీయాంశమైంది. అతను రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన కబుర్లు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు దీని గురించి మరోవార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.